అర్జున్‌రెడ్డి హిందీ వెర్షన్ ఇంకా చూడని విజయ్ దేవరకొండ..

| Edited By: Pardhasaradhi Peri

Jul 16, 2019 | 12:06 PM

బాలీవుడ్‌‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కబీర్ సింగ్.. కలెక్షన్ల చరిత్రను తిరగరాస్తోంది. తెలుగులో అర్జున్‌రెడ్డీ మూవీ కంటే హిందీలోనే సంచలనం సృష్టిస్తోంది. హిందీలొ కబీర్‌సింగ్‌గా షాహీద్ కపూర్ నటించారు. ఈచిత్రం వసూళ్ల విషయంలో సల్మాన్, అజయ్ దేవ్‌గణ్ చిత్రాలనే షేక్ చేస్తోంది. అయితే దీని ఒరిజినల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. తాను ఇప్పటివరకు హిందీ వెర్షన్ చూడలేదని, ఒకసారి చేసిన చిత్రాన్ని మళ్లీ చూడాలని తాను అనుకోవడం లేదన్నాడు. చిత్ర […]

అర్జున్‌రెడ్డి హిందీ వెర్షన్ ఇంకా చూడని విజయ్ దేవరకొండ..
Follow us on

బాలీవుడ్‌‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కబీర్ సింగ్.. కలెక్షన్ల చరిత్రను తిరగరాస్తోంది. తెలుగులో అర్జున్‌రెడ్డీ మూవీ కంటే హిందీలోనే సంచలనం సృష్టిస్తోంది. హిందీలొ కబీర్‌సింగ్‌గా షాహీద్ కపూర్ నటించారు. ఈచిత్రం వసూళ్ల విషయంలో సల్మాన్, అజయ్ దేవ్‌గణ్ చిత్రాలనే షేక్ చేస్తోంది. అయితే దీని ఒరిజినల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. తాను ఇప్పటివరకు హిందీ వెర్షన్ చూడలేదని, ఒకసారి చేసిన చిత్రాన్ని మళ్లీ చూడాలని తాను అనుకోవడం లేదన్నాడు. చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనకు మంచి ఫ్రెండ్ అని.. తనకు అంతా మంచి జరగాలనే తాను ఆశిస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు.