Hari Hara Veera Mallu OTT: పవన్ ఫ్యాన్స్‌కు బంపర్ బోనాంజా.. ఓటీటీలోకి వీరమల్లు.. అధికారిక ప్రకటన

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ అండ్ స్పిరిట్ ఇప్పుడు థియేటర్ల తర్వాత ఓటీటీకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Hari Hara Veera Mallu OTT: పవన్ ఫ్యాన్స్‌కు బంపర్ బోనాంజా.. ఓటీటీలోకి వీరమల్లు.. అధికారిక ప్రకటన
Hari Hara Veeramallu OTT

Updated on: Aug 19, 2025 | 7:14 PM

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు థియేటర్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. క్రిష్-జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, ఏఎం రత్నం నిర్మాణంలో వచ్చిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూలై 24న గ్రాండ్ రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకుంది. ఇక థియేటర్ల హంగామా ముగియగానే, సినిమా ఓటీటీ వేదికపైకి అడుగుపెడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20 నుంచి హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ అండ్ స్పిరిట్ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు మాత్రమే కాదు, తమిళం, మలయాళంలో కూడా అందుబాటులోకి రాబోతుండటంతో సౌత్ ఆడియన్స్‌కి డబుల్ బోనంజా అని చెప్పాలి.

సినిమా మొత్తాన్ని రెండు పార్ట్స్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే పార్ట్ 1 రిలీజ్ కాగా, పార్ట్ 2 షూట్ కొంతవరకు పూర్తయినట్లు టాక్. పవన్‌తో పాటు బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ వంటి స్టార్ కాస్ట్ ఈ ప్రాజెక్ట్‌లో కీ రోల్స్ పోషించారు. థియేటర్లో మిస్ అయినవాళ్లు.. ఇప్పుడు ప్రైమ్‌లో హరి హర వీరమల్లుని చూసెయ్యడానికి రెడీ అవ్వండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.