Hansika Motwani: ఆ టాలీవుడ్ హీరో నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన హన్సిక

|

May 23, 2023 | 8:59 AM

పలువురు హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను పలు ఇంటర్వ్యూల్లో బయట పెట్టిన విషయం తెలిసిందే.. కొంతమంది ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం తమకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు.

Hansika Motwani: ఆ టాలీవుడ్ హీరో నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన హన్సిక
Hansika
Follow us on

ఇండస్ట్రీలో  ఇప్పటికే చాలా మంది క్యస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు బయట పెట్టిన విషయం తెలిసిందే.. పలువురు హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను పలు ఇంటర్వ్యూల్లో బయట పెట్టిన విషయం తెలిసిందే.. కొంతమంది ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్తున్నప్పటికీ మరికొంతమంది మాత్రం తమకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. చాలా మంది లైగిక వేధింపుల పై పోరాటం కూడా చేస్తున్నారు. తాజాగా క్రేజీ హీరోయిన్ హన్సిక కూడా తనకు ఎదురైనా ఓ అనుభవాన్ని తెలిపింది. ఓ టాలీవుడ్ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది హన్సిక.  దాంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు.

హన్సికను కుర్రాళ్ల కలల రాకుమారిగా భావిస్తుంటారు. అందం అభినయం కలబోసిన హన్సిక ఇటీవలే కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది. రీసెంట్ గా పెళ్లిపీటలెక్కింది ఈ బ్యూటీ. దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార హన్సిక. తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ అదే సమయంలో కోలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ముంబయికి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కతూరియాతో వివాహం చేసుకుందీ బ్యూటీ.

తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ లో తెలిపింది ఓ హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశాడని తెలిపింది. అస్తమానం డేట్‌కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరోకి తగిన రీతిలో బుద్ది చెప్పానని తెలిపింది హన్సిక. అయితే ఆ హీరో ఎవరు అన్నది మాత్రం తెలుపలేదు.