ఓటీటీలోకి జీవి ప్రకాష్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ కింగ్ స్టన్.. ఎప్పటినుంచంటే

|

Mar 27, 2025 | 7:37 AM

ఓవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతూ.. ఇంకోవైపు నటుడిగానూ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంటాడు జి.వి.ప్రకాష్ కుమార్. అలాంటి ఈయన.. తాజాగా ‘కింగ్ స్టన్’ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఫస్ట్ సీ హర్రర్ సినిమా ఇదే అంటున్నారు. హైద్రాబాద్‌కు వచ్చి మరీ తన సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసుకున్నారు.

ఓటీటీలోకి జీవి ప్రకాష్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ కింగ్ స్టన్.. ఎప్పటినుంచంటే
Kingston
Follow us on

యంగ్ యాక్టర్ కామ్ , మ్యూజిక్ డైరెక్టర్ కింగ్ స్టన్  సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా మరో వైపు నటుడిగా ప్రేక్షలను ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా కింగ్ స్టన్ సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సినిమా సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్,  2025 మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ చేశారు. కాగా ఈ సినిమా కు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. జీవీ ప్రకాష్ ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా, సంగీత దర్శకుడిగా అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. అలాగే జీవికి జోడీగా దివ్యభారతి హీరోయిన్‌గా నటించింది. సాబుమాన్ అబ్దుసమద్, అజగన్ పెరుమాళ్ వంటి నటులు ఇతర పాత్రల్లో కనిపించరు.

ఈ సినిమా కథ తమిళనాడు సముద్ర తీరంలోని తూవత్తూర్ అనే గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు శవాలుగా తిరిగి వస్తారనే నమ్మకం ఉంది, దీనికి ఒక ఆత్మ కారణమని భావిస్తారు. ఈ నేపథ్యంలో, కింగ్‌స్టన్ (జీవీ ప్రకాష్) అనే యువకుడు థామస్ (సాబుమాన్ అబ్దుసమద్) అనే వ్యక్తి వద్ద పనిచేస్తూ ఉంటాడు. థామస్ స్మగ్లింగ్ వ్యాపారంలో ఉన్నాడని, అది ఒక యువకుడి మరణానికి దారితీసినప్పుడు కింగ్‌స్టన్‌కు తెలుస్తుంది. దీంతో థామస్‌ను ఎదిరించి, గ్రామస్థులకు ఉపాధి కల్పించేందుకు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలని నిర్ణయిస్తాడు. అయితే, ఈ ప్రయత్నంలో అతను సముద్రంలోని భయానక రహస్యాలను ఎదుర్కొంటాడు.

థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. కింగ్‌స్టన్ చిత్రం ఏప్రిల్ 4, 2025 ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 OTT ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. అయితే, ఈ విషయంలో నిర్మాతలు లేదా OTT ప్లాట్‌ఫారమ్ ఇంకా అధికారిక ప్రకటించలేదు. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకొని ఈ సినిమా ఓటీటీలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.