సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ లో త్రో బ్యాక్ పిక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సినిమా తరాలకు సంబందించిన ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఫోటోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా పైన కనిపిస్తోన్న ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న యువకుల్లో ఓ స్టార్ దర్శకుడు ఉన్నారు. ఆయన సినిమాలు అన్ని భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఇంతకు ఆ దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా..? చూడగానే టక్కున చెప్పే దర్శకుడు ఆయన. టాలీవుడ్ లో మొదలు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో స్టార్ దర్శకుడిగా మారారు. ఆయన ఎవరో కాదు..
పై ఫొటోలో కనిపిస్తోన్న పిల్లల్లో దాగిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే దర్శక ధీరుడు రాజమౌళి.స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రాజమౌళి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు రాజమౌళి. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ తో కలిసి సింహాద్రి సినిమా చేశారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నితిన్ హీరోగా సై, ప్రభాస్ తో ఛత్రపతి, రవితేజతో విక్రమార్కుడు, మరోసారి ఎన్టీఆర్ తో యమదొంగ, రామ్ చరణ్ తో మగధీర, సునీల్ తో మర్యాదరామన్న, నాని తో ఈగ సినిమాలు చేశారు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా బాహుబలి సినిమాను తెరకెక్కించి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా సాధించిన విజయం అంతా ఇంత కాదు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు జక్కన్న.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.