Tollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గ్లామర్ బ్యూటీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?..

ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. గ్లామర్ రోల్స్ కాదు..కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్రలోనైన నటించేందుకు రెడీ అంటూ నిరూపించేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను ఆకట్టుకున్న ఈ తార.. తాజాగా షాకింగ్ లుక్ లో కనిపించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఎవరో గుర్తుపట్టారా ?

Tollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గ్లామర్ బ్యూటీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?..
Tollywood Actress

Updated on: Aug 04, 2023 | 11:25 PM

పైన ఫోటోలో కనిపిస్తోన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?. వెండితెరపై గ్లామర్ బ్యూటీ.. సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. గ్లామర్ రోల్స్ కాదు..కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్రలోనైన నటించేందుకు రెడీ అంటూ నిరూపించేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను ఆకట్టుకున్న ఈ తార.. తాజాగా షాకింగ్ లుక్ లో కనిపించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఎవరో గుర్తుపట్టారా ?తనే హీరోయిన్ మాళవిక మోహన్. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. సౌత్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. 2013లో పట్టం పోలే సినిమాతో మలయాళం సినీపరిశ్రమలోకి తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. దాదాపు ఆరేళ్లపాటు కన్నడ, హిందీ, మలయాళంలో సినిమాలు చేసింది.. 2019లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పెట్టా చిత్రంతో ఒక్కసారిగా అమ్మాడి క్రేజ్ మారిపోయింది. చెప్పాలంటే ఈ బ్యూటీకి ఆ సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకొవాలి.

ఈ సినిమా తర్వాత మాస్టర్, మారన్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా చియాన్ విక్రమ్ నటిస్తోన్న తంగలాన్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో మాళవిక పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది.

ఒంటిపై పచ్చబొట్లు, చేతిలో ఆయుధం, మెడ, నడుము తల చుట్టూ తాళ్లతో కనిపించింది తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే ఈమూవీలో మాళవికా రోల్ కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పీరియాడికల్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాలో మాళవిక.. ఆరతి అనే పాత్రలో కనిపించనుందని తెలియజేశారు మేకర్స్. మాళవికా ఫస్ట్ లుక్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.