AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్సాదియ్యా..! సడన్‌గా చూసి వంటలక్క అనుకునేరు.. హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఆ బ్యూటీ

ఓవర్ నైట్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు చాలా మంది ముద్దుగుమ్మలు. ఇంకొంతమంది ఎంత త్వరగా క్రేజ్ తెచ్చుకుంటున్నారో అంతే త్వరగా కనుమరుగవుతున్న. స్టార్టింగ్ లో జోరు చూపించిన చాలా మంది భామలు ఇప్పుడు స్పీడ్ తగ్గించేశారు. కొంతమంది పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు.

తస్సాదియ్యా..! సడన్‌గా చూసి వంటలక్క అనుకునేరు.. హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఆ బ్యూటీ
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2024 | 12:37 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కొత్త కొత్త హీరోయిన్స్ పరిచయమవుతున్నారు. కొంతమంది ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఓవర్ నైట్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు చాలా మంది ముద్దుగుమ్మలు. ఇంకొంతమంది ఎంత త్వరగా క్రేజ్ తెచ్చుకుంటున్నారో అంతే త్వరగా కనుమరుగవుతున్న. స్టార్టింగ్ లో జోరు చూపించిన చాలా మంది భామలు ఇప్పుడు స్పీడ్ తగ్గించేశారు. కొంతమంది పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. మరికొంతమంది ఇతర భాషలకు కూడా చెక్కేస్తున్నారు. ఇదిలా ఉంటే పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా. ? అంత ఈజీ మర్చిపోయే భామ కాదు ఆమె.. తన గ్లామర్ తో గత్తర లేపిన చిన్నది ఆమె.. ఇప్పుడు ఇలా వంటలక్క లుక్ లోకి మారిపోయింది. ఆమెను గుర్తు పట్టడం కష్టమే కానీ గట్టిగా ట్రై చేస్తే చెప్పేయొచ్చు..

ఇది కూడా చదవండి : రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?

పై ఫొటోలో ఉన్న బ్యూటీ చాలా మంది కుర్రకారు కలల రాకుమారి. తన అందాలతో ఎంతోమంది హృదయాలను బద్దలు కొట్టింది ఆమె. అంతే కాదు అందాలు ఆరబోయడంలోనూ వెనుకాడదు ఆ హాటీ. ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే హాట్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చింది. ఆర్జీవీ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆయనతో వరుస సినిమాలు చేసింది. ఆమె మరెవరో కాదు అప్సరరాణి. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అంకేత మహారాణా.. కానీ ఆమె సినిమా ఇండస్ట్రీలో అప్సరా రాణిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి :Sai Pallavi: ఇదికదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! ముచ్చటగా మూడోసారి ఆ హీరోతో సాయి పల్లవి..

ముఖ్యంగా ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలతో ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 4 లెటర్స్‌ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. బికినీ సీన్స్ కు ఈ బ్యూటీ కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. సినిమాల్లో బోల్డ్ సీన్స్ లో , రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటిస్తుంది ఈ చిన్నది. ఇక ఆ మధ్య ఆర్జీవీ తెరకెక్కించినా డేంజర్ అనే సినిమాలో ఓ రేంజ్ లో అందాలతో రెచ్చిపోయింది అప్సర రాణి. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది సెగలు రేపే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us