Tollywood: ఈ చిన్ని కృష్ణుడు ఇప్పుడు టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పడితే మీరు తోపులే

మొదట షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్నాడు. ఓ వైపు డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టుకుంటూనే హీరోగా, నటుడిగా కూడా సత్తా చాటుతున్నాడు.

Tollywood: ఈ చిన్ని కృష్ణుడు ఇప్పుడు టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పడితే మీరు తోపులే
Tollywood Actor

Updated on: May 27, 2025 | 1:56 PM

పై ఫొటోలో కృష్ణుడి వేషంలో ఉన్న పిల్లోడిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. దర్శకుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో ఇతను కూడా ఒకడు. చెన్నైలో పుట్టినప్పటికీ ఎక్కువగా హైదరాబాద్ లో పెరిగాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు. ఆ తర్వాత స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆపై న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి పట్టభద్రుడయ్యాడు. మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. దర్శకుడిగా తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మెగా ఫోన్ పట్టుకుని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత యూత్ ఫుల్ఎంటర్ టైనర్స్ తీసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఓవైపు దర్శకుడిగా మెప్పిస్తూనే మరోవైపు నటుడిగానూ మెప్పిస్తున్నాడీ ట్యాలెంటెడ్ పర్సన్. ఓ సినిమాలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. ఇలా మల్టీ ట్యాలెంటెతో దూసుకెళుతోన్న ఈ సెలబ్రిటీని గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు పెళ్లి చూపులు, ఏమైంది ఈ నగరానికి సినిమాల డైరెక్టర్ తరుణ్ భాస్కర్.

ఈ మధ్యనతరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా కంటే నటుడిగానే ఎక్కువగా వెండితెరపై కనిపిస్తున్నాడు . అతను దర్శకత్వం వహించిన కీడా కోలా సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తోంది. దీని తర్వాత మరే కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు తరుణ్ భాస్కర్. ఆ మధ్యన విజయ్ దేవర కొండతో ఒక సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది కానీ.. అధికారిక ప్రకటనలేమీ రాలేదు. అయితే నటుడిగా మాత్రం పలు సినిమాల్లో కనిపిస్తున్నాడు తరుణ్. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. తరచూ తన తల్లితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేసుకుంటున్నాడు. పైనున్న ఫొటో కూడా అదే.

హీరోయిన్ ఇషా రెబ్బాతో  తరుణ్ భాస్కర్..

తల్లితో కలిసి వెకేషన్ లో.,

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.