AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ హాట్ బ్యూటీ.. అమెరికాలో జాబ్ మానేసి మరీ సినిమాల్లోకి..

యాంకర్, యాక్టర్, టెలివిజన్ ప్రజెంటర్.. ఇలా టాలీవుడ్ లో మల్లీ ట్యాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుందీ అందాల తార. బుల్లితెరతో పాటు అప్పుడప్పుడూ సిల్వర్ స్క్రీన్ తో పాటు మెరుస్తూ బిజి బిజీగా ఉంటోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Tollywood: రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ హాట్ బ్యూటీ.. అమెరికాలో జాబ్ మానేసి మరీ సినిమాల్లోకి..
Actress Roja
Basha Shek
|

Updated on: Apr 06, 2025 | 4:20 PM

Share

పై ఫొటోలో నటి రోజాతో ఉన్న ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడీ చిన్నారి టాలీవుడ్ లో హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ. ఓ ధనిక కుటుంబంలో పుట్టిన ఈ నటి చదువులో బాగా చురుకు. అందుకే ఎంబీఏలో హెచ్ ఆర్ మేనెజ్మెంట్ పూర్తి చేసి అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడే చాలా రోజులు జాబ్ చేసింది. అదే సమయంలో టైం పాస్ కోసం, ఖాళీ సమయాల్లో ఇన్ స్టా గ్రామ్ రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసింది. దీంతో ఈ అమ్మడికి నెట్టంట క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో ఓ తెలుగు సినిమాలో అనుకోకుండా అవకాశం వచ్చింది. అమెరికాలో షూట్ కావడంతో జాబ్ చేస్తూనే షూటింగ్ కు హాజరైంది. తీరా ఆ సినిమా రిలీజయ్యాక ఏకంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందీ అందాల తారకు. అంతే జాబ్ ను, అమెరికాను వదిలేసి ఇండియాకు వచ్చేసింది. ఇప్పుడు నటిగా, యాంకర్ గా రాణిస్తూ టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. యస్. తన మరెవరో కాదు అషూ రెడ్డి. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.

ఇవి కూడా చదవండి

నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది అషూ రెడ్డి. అందులో అమెరికాలో ఉండే పలు సీన్స్ లో హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్ లా అషూ రెడ్డి కనిపిస్తుంది. ఛల్ మోహన్ రంగ సినిమా 2018లో రిలీజ్ కాగా, ఆ మరుసటి ఏడాదే అంటే 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ వచ్చిందీ అందాల తారకు. దీంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ అషూ రెడ్డిని సెన్సేషన్ చేసింది. ప్రస్తుతం ఎక్కువగా టీవీ షోల్లోనే కనిపిస్తోందీ అందాల తార. అప్పుడప్పుడు వెండితెరపైనా కనిపిస్తోంది.

టీవీ షోలో అషూ రెడ్డి..

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

ఇక సోషల్ మీడియాలోనూ అషూ రెడ్డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

అషూ రెడ్డి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?