
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ లెజెండ్ అని చెప్పవచ్చు. కమెడియన్‌గా, మాటల రచయితగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారాయన. తన ప్రతిభకు గుర్తింపుగా నాలుగు నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఈ టాలీవుడ్ నటుడిది తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని నేదనూరు. తండ్రి వేదపండితుడు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత కూడా. అప్పటి జమీందారు ఆయన పాండిత్య ప్రతిభకు మెచ్చి ఒక ఇల్లు బహుమానంగా కూడా ఇచ్చాడట. ఈ నటుడు పెద్దన్నయ్య కూడా వేద పండితుడే. ఈయన మాత్రం చాల డిఫరెంట్ గా నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. డ్రామాలు, నాటకాల్లో నటించి రంగ స్థలం నటుడిగా రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం ఆల్ ఇండియో రేడియోలో పనిచేశారు. అయితే నటనపై ఆసక్తిని చంపుకోలేక సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదట మాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నటునిగా అంచెలంచెలుగా ఎదిగారు. సుమారు 400 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించడమే కాదు ఆడియెన్స్ తో కన్నీళ్లు కూడా పెట్టించగలరీ నటుడు. ఏ పాత్రలోనైనా పరకాయం ప్రవేశం చేయగలిగే ప్రతిభ ఈయన సొంతం. అందుకే నాలుగు నంది అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు.మరి ఆయనెవరో గుర్తు పట్టారా?
పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి అదే నండి ఎల్. బి. శ్రీరామ్. ఆయన పక్కన ఉన్నది భార్య. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ సందర్భంలో ఆయనే ఈ ఫొటోను షేర్ చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో హలో బ్రదర్ (1994), హిట్లర్ (1997) లాంటి విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు ఎల్బీ శ్రీరామ్. ఆ తరువాత ఇ.వి.వి. సినిమా చాలా బాగుంది సినిమాలో పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. ఒక అమ్మో ఒకటో తారీఖు సినిమాలో తన నటనతో అందరినీ ఏడిపించారీ ట్యాలెంటెడ్ యాక్టర్.
తన సినిమా కెరీర్ లో మొత్తం సుమారు 400 కు సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా యూబ్యూబ్ ఛానెల్ ద్వారా పలు ఆసక్తికరమైన వీడియోలు షేర్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.