సినిమా కోసం తమను తాము మార్చుకునే నటీనటులు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. పాత్రలకు తగ్గట్టుగా సిక్స్ ప్యాక్ పెంచుతుంటారు చాలామంది. మరికొందరు ఫ్యామిలీ ప్యాక్ లాగా లావుగా మారిపోతుంటారు. అలాగే బరువు తగ్గి సన్నగా మారుతుంటారు కూడా. ఇక సినిమాల్లో లేడీ గెటప్పులు, ట్రాన్స్ జెండర్ లు వేయాలంటే చాలా ధైర్యం వేయాల్సిందే. సాధారణంగా చాలామంది హీరోలు, నటీనటులు ఈ రోల్స్ కు దూరంగా ఉంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం ఏ పాత్రకైనా రెడీ అంటుంటారు. పై ఫొటో లో ఉన్న హీరో కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతాడు. టాలీవుడ్ కు చెందిన ఈ ట్యాలెంటెడ్ హీరో సినిమా సినిమాకు వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. ఇటీవల రిలీజైన ఒక సూపర్ హిట్ సినిమా లో ఏకంగా ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించాడీ వెర్సటైల్ హీరో. అయితే థియేటర్లలో రిలీజైనప్పుడు ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో చాలామందికి ఈ మూవీ రీచ్ కాలేదు. అయితే ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో ఈ చిత్రాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. అందులో హీరో పోషించిన ట్రాన్స్ జెండర్ రోల్ ను చూసి షాక్ అవుతున్నారు. అలా ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో తెగ ట్రెండ్ అవుతోంది. మరి ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? యస్. ఇతను మరెవరో కాదు ఇటీవలే స్వాగ్ సినిమాతో నట విశ్వరూపం చూపించిన శ్రీ విష్ణు.
హసిత్ గోలి తెరకెక్కించిన స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు ఏకంగా ఐదు పాత్రలు పోషించాడు. మహారాజు, పోలీసాఫీసర్ , యువకుడిగా, డ్యాన్సర్ గా, ట్రాన్స్ జెండర్ గా, ముసలివాడిగా ఇలా అనేక గెటప్పుల్లో నటించి మెప్పించాడు. ప్రతి పాత్రకు నటన, వాయిస్ వేరియేషన్స్, మేకప్ డిఫరెన్స్ తో అదరగొట్టేసాడు. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ విభూతి పాత్రలో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాడు శ్రీ విష్ణు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విభూతి పాత్రకు సంబంధించిన ఫొటోలే దర్శనమిస్తున్నాయి. శ్రీ విష్ణు నటనను మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
స్వాగ్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. చూసిన వాళ్లందరూ సినిమా చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
🔥🔥 Gender Equality meedha ippati varaku vachina movie lo the best #Swag
1st half little bit disappoint chesina.. 2nd half #Hasith thana pen power choopinchaadu. Specially ee climax heart touching.. @sreevishnuoffl #Vibhuthi performance topnotch 🔥
#SreeVishnu @hasithgoli pic.twitter.com/XZ5VjC0DQN— Cinemalu24 (@Cinemalu24) October 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.