AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: ‘ధురంధర్ 2’లో కనిపించిన ఈ నర్సును గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. భర్త కూడా..

ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ది రివేంజ్ సినిమాలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యముంది. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీలో చాలా మంది స్టార్ యాక్టర్స్ కనిపిస్తారు. ఇక సినిమా లో వచ్చే ఈ నర్సు పాత్ర కూడా మూవీకి హైలెట్ గా నిలిచింది.

Dhurandhar 2: 'ధురంధర్ 2'లో కనిపించిన ఈ నర్సును గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. భర్త కూడా..
Dhurandhar The Revenge Movie
Basha Shek
|

Updated on: Mar 23, 2026 | 10:16 AM

Share

మొదటి పార్ట్ ను మించి కలెక్షన్లు రాబడుతోంది ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2). మార్చి 19న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నాలుగు రోజుల్లోనే రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురందర్ 2లో రణ్ వీర్ సింగ్ పాత్ర హైలెట్ గా నిలిచింది. అలాగే ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, గౌరవ్ జెరా, డ్యానిష్ పండోర్, సౌమ్యా టాండన్, అశ్విన్ ధర్.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ మూవీలో వివిధ పాత్రల్లో మెరిశారు. అయితే ఇదే ధురందర్ 2 సినిమాలో ఒక నర్సు పాత్ర కూడా హైలెట్ గా నిలిచింది. షజియా బానో అనే ఓ రియల్ క్యారెక్టర్ ఆధారంగా ఈ పాత్రను రూపొందించారు. ఇప్పుడు ఈ క్యామియో రోల్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ నర్సు పాత్రలో కనిపించిందెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే ఇప్పుడు కేవలం హిందీ సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఆమె మరెవరో కాదు ఈ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య యామీ గౌతమ్.

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్. నువ్విలా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, యుద్ధం సినిమాల్లో కథానాయికగా చేసిందీ ముద్దుగుమ్మ. అయితే 2015 తర్వాత కేవలం హిందీ సినిమాలకే పరిమితమైందీ అందాల తార. విక్కీ డోనర్, బద్లాపూర్, కాబిల్, సర్కార్3, ఉరి, బాల, ఆర్టికల్ 370, హఖ్ తదిరత సూపర్ హిట్ సినిమాల్లో నటించింది యామీ. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో లేడీ ఓరియంటెండ్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

భార్య యామీ గౌతమ్ తో ధురంధర్  2 డైరెక్టర్..

కాగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన మొదటి సినిమా ఉరిలో యామీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది . అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2021 జూన్ లో పెద్దల అనుమతితో ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. 2024లో ఈ దంపతులకు వేదవిద్ ధార్ అనే అబ్బాయి పుట్టాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విండీస్ పై సిక్సర్ల వర్షం..మూడేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
విండీస్ పై సిక్సర్ల వర్షం..మూడేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
కుక్క కాటు మాత్రమే కాదు.. ఇవి కరిచినా రేబీస్‌ ముప్పు!
కుక్క కాటు మాత్రమే కాదు.. ఇవి కరిచినా రేబీస్‌ ముప్పు!
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్
క్రిస్పీ రింగ్ స్నాక్స్.. ఒక్కటి తింటే గిన్నె ఖాళీ చేసేయడం ఖాయం!
క్రిస్పీ రింగ్ స్నాక్స్.. ఒక్కటి తింటే గిన్నె ఖాళీ చేసేయడం ఖాయం!
ఏపీలో మరో కొత్త రైలు.. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం..
ఏపీలో మరో కొత్త రైలు.. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం..
నిమ్మ గింజలు మింగేశారా? కడుపులో ఏం జరుగుతుందో తెలుసా?
నిమ్మ గింజలు మింగేశారా? కడుపులో ఏం జరుగుతుందో తెలుసా?
ప్రాణం తీసిన వేగం.. లారీ ఢీకొట్టి స్పాట్‌లోనే ఐదుగురు మహిళలు మృతి
ప్రాణం తీసిన వేగం.. లారీ ఢీకొట్టి స్పాట్‌లోనే ఐదుగురు మహిళలు మృతి
బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా..
బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా..
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది