ఒకప్పుడు పాన్, పెన్నులు అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా? కూతురు కూడా తెలుగులో..

సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన వారిలో ఈ నటుడు కూడా ఒకడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్, గాడ్ ఫాదర్ అండ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇతను తన కామెడీతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన అతను..

ఒకప్పుడు పాన్, పెన్నులు అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా? కూతురు కూడా తెలుగులో..
Tollywood Actor

Updated on: May 07, 2026 | 12:13 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాప్ కమెడియన్. పేరుకు కమెడియన్ అయినా తనకు స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఉంది. అలాగే హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే ఈ రేంజ్ కు రావడానికి అతను చాలా కష్టపడ్డాడు. పొట్టకూటి కోసం, ఫ్యామిలీ పోషణ కోసం చిన్న చిన్నపనలు, ఉద్యోగాలు చేశాడు. చిన్పప్పుడే కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడడంతో ఏడవ తరగతి వరకు చదివి మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత డబ్బుల కోసం పాన్ అమ్మడం, పెన్నులు అమ్మడం చేసేవారు. అలా వచ్చిన డబ్బులతోనే కడుపునింపుకొనేవాడు.. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. మొదట చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అయినా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా తన కామెడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకున్నాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ హాస్య నటుడిగా మారిపోయారు. ఒకప్పుడు రోడ్డుపై పాన్, పెన్నులు అమ్మిన ఇతని ఆస్తి సుమారు రూ.300 కోట్లని తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ కమెడియన్ ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు టాప్ కమెడియన్ జానీ లీవర్. పేరకు బాలీవుడ్ నటుడైనా తెలుగు ఆడియెన్స్ కు కూడా ఇతను పరిచయమే. హిందీలో 300 కు పైగా సినిమాల్లో నటించిన జానీ తెలుగులోనూ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. నాగార్జున నటించిన క్రిమినల్, వెంకట్ కొత్త కొత్తగా సినిమాల్లో యాక్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా జానీ లీవర్..

అన్నట్లు జానీ లీవరే కాదు అతని కూతురు జేమీ లీవర్ కూడా క్రేజీ హీరోయిన్.ప్రస్తుతం హిందీతో పాటు తెలుగులో సినిమాలు చేస్తోందీ అమ్మడు. హిందీలో హస్ ఫుల్ 4, బూత్ పోలీస్ వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన జేమీ.. ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అల్లరి నరేష్ హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

కూతురు జేమీ లీవర్ తో జానీ లీవర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us