హైదరాబాద్లోని చార్మినార్ వద్ద బెంగాలీ నటి ప్రత్యూష పాల్ వేధింపులకు గురైన ఘటన కలకలం రేపింది. సందర్శనకు వచ్చిన సమయంలో ఓ స్థానిక వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకగా, వెంటనే అప్రమత్తమైన నటి అతడిని పట్టుకొని నిలదీసింది. స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.