Tollywood: మొదటి సినిమాకే రూ.10 రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

|

Sep 01, 2024 | 8:40 AM

పాన్ ఇండియా లెవల్లో అప్పట్లో భారీ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్న వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. కథానాయికగా కెరీర్ నెమ్మదించిన తర్వాత సహయ పాత్రలలో కనిపించింది.

Tollywood: మొదటి సినిమాకే రూ.10 రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Follow us on

సినీ తారల అరుదైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఆకర్షిస్తున్నాయి. భారతీయ సినిమాలో బాలతారగా అరంగేట్రం చేసి ఎన్నో హిట్స్ అందించిన ఓ నటి చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్నార్, కృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అంతేకాదు.. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వంటి బాలీవుడ్ సూపర్ స్టార్లతో నటించి హిట్స్ అందించిన నటి. పాన్ ఇండియా లెవల్లో అప్పట్లో భారీ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్న వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. కథానాయికగా కెరీర్ నెమ్మదించిన తర్వాత సహయ పాత్రలలో కనిపించింది. ఆ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ జయసుధ. నటిగానే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్ కూడా. 1974లో జయప్రద తెలుగులో ‘భూమికోసం’ సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. జయప్రద పదమూడేళ్ల వయసులో మొదటి జీతం రూ.10.

ఆమె 1976లో కమల్ హాసన్ సరసన ‘మన్మద లీలై’ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. జయప్రద ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. జీతేంద్రతో ఆమె జతకట్టడం బాలీవుడ్‌లో బెస్ట్ స్టార్ పెయిరింగ్‌గా ప్రశంసలు అందుకుంది. ఇద్దరూ కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. జయప్రద తన అద్భుతమైన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. సినిమాల్లో స్టార్ డమ్ అందుకున్నప్పటికీ జయప్రద వ్యక్తిగత జీవితం చాలాసార్లు వివాదాల్లో చిక్కుకుంది. 1986లో, ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్న శ్రీకాంత్ నహదాను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా జయప్రద సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. రాజకీయాల్లో చురుకుగా ఉన్న జయప్రద రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.

ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నాయకుడు ఎన్.టి. రామారావు ఆహ్వానం మేరకు జయప్రద రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చినప్పుడు జయప్రద చంద్రబాబు నాయుడు పక్షాన నిలిచారు. జయప్రద 1996లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీని వీడి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి 67,000 ఓట్ల మెజారిటీతో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. 2 ఫిబ్రవరి 2010న, జయప్రద సమాజ్‌వాది పార్టీ నుండి బహిష్కరించబడ్డారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.