AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ చిన్నారి ఒక్క వాసెలిన్ యాడ్‌తో హీరోయిన్ అయింది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి 12వ తరగతిలో టాపర్. అంతేకాదు.. IAS ఆఫీసర్ కావాలనుకుంది. కట్ చేస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే వాణిజ్య ప్రకటనలలోనూ మెరిసింది. ఈ అమ్మాయి చేసిన వాసెలిన్ యాడ్ లో నటించింది.

Tollywood: ఈ చిన్నారి ఒక్క వాసెలిన్ యాడ్‌తో హీరోయిన్ అయింది.. ఎవరో గుర్తుపట్టగలరా ?
Actress 2
Rajitha Chanti
|

Updated on: Jul 11, 2024 | 5:09 PM

Share

సాధారణంగా సినీ పరిశ్రమలో చాలా మంది తారలు గమ్యం వేరుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను కాకుండా మరోదారిని ఎంచుకున్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ తాము ఎప్పుడూ నటిగా మారాలని అనుకోలేదని.. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని అంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి 12వ తరగతిలో టాపర్. అంతేకాదు.. IAS ఆఫీసర్ కావాలనుకుంది. కట్ చేస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే వాణిజ్య ప్రకటనలలోనూ మెరిసింది. ఈ అమ్మాయి చేసిన వాసెలిన్ యాడ్ లో నటించింది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది. తనే హీరోయిన్ రాశీ ఖన్నా.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలు దోచేసింది. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ సరసన అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి స్టార్ హీరోల మూవీలో అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ సినిమాలో కనిపించింది.

నిజానికి రాశీ ఖన్నా తన సినీ ప్రయాణాన్ని హిందీ సినిమాతోనే ప్రారంభించింది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతోనే నటిగా పరిచయమైంది. ఈ మూవీలో రాశీ ఖన్నా పోషించిన పాత్ర చాలా చిన్నది. ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగు, తమిళంలో భాషలలో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక ఇటీవలే అరణ్మనై 4 చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో ది సబర్మతి రిపోర్ట్ మూవీతోపాటు.. తలాఖోన్ మే ఏక్ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇక తెలుగులో తెలుసు కదా మూవీలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వారసులు లేరు.. వీలునామా రాయలేదు.. ఆ వ్యక్తి చనిపోయాక ఆస్తి..
వారసులు లేరు.. వీలునామా రాయలేదు.. ఆ వ్యక్తి చనిపోయాక ఆస్తి..
విష్ణుమూర్తిని రాయిగా మార్చిన వృంద ఎవరు? శాలిగ్రామ, తులసి వివాహం
విష్ణుమూర్తిని రాయిగా మార్చిన వృంద ఎవరు? శాలిగ్రామ, తులసి వివాహం
వైర్డ్ ఛార్జింగ్​? వైర్‌‌లెస్​ ఛార్జింగ్​? ఏది బెటర్​
వైర్డ్ ఛార్జింగ్​? వైర్‌‌లెస్​ ఛార్జింగ్​? ఏది బెటర్​
ఫోన్​ క్లోజ్ చేస్తే ఆటో లాక్​ అయిపోతుంది.. సఫారీలో అప్​గ్రేడ్‌
ఫోన్​ క్లోజ్ చేస్తే ఆటో లాక్​ అయిపోతుంది.. సఫారీలో అప్​గ్రేడ్‌
మేక మాంసాన్ని ‘మటన్’ అని ఎందుకు పిలుస్తారు?
మేక మాంసాన్ని ‘మటన్’ అని ఎందుకు పిలుస్తారు?
బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన శివాజీ..
బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన శివాజీ..
ఆధార్‌లో పేరు మార్చుకోవడం అంత ఈజీ కాదు.. కొత్త రూల్స్ వచ్చేశాయ్!
ఆధార్‌లో పేరు మార్చుకోవడం అంత ఈజీ కాదు.. కొత్త రూల్స్ వచ్చేశాయ్!
భారత్‌లో టాప్ యాప్స్, గేమ్స్‌ ప్రకటించిన గూగుల్
భారత్‌లో టాప్ యాప్స్, గేమ్స్‌ ప్రకటించిన గూగుల్
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? మీ తెలివికి పరీక్ష పెట్టే ప్రశ్న
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? మీ తెలివికి పరీక్ష పెట్టే ప్రశ్న
బండి తాళాలకు ఈ మెటల్ ట్యాగ్ ఎందుకో తెలిస్తే అస్సలు పారేయరు
బండి తాళాలకు ఈ మెటల్ ట్యాగ్ ఎందుకో తెలిస్తే అస్సలు పారేయరు