ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. తెలుగు యూత్‌ను తన డ్యాన్స్‌లతో ఊర్రూతలుగించారు. ఎన్నో అవమానాలు.. ప్రతి అడుగులో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పట్టుదలతో ఇండస్ట్రీలోనే మెగాస్టార్ అయ్యారు. ఈరోజు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా గత రెండు రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో చిరు బర్త్ డే సంబరాలు మొదలయ్యాయి. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పక్కర్లేదు. చిరుకు సంబంధించిన లేటేస్ట్, త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తూ అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో చిరుతో తాను చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. పైన ఫోటోను చూశారు కదా. చిరు ఒడిలో కూర్చున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో. ఇప్పుడిప్పుడే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రోటీన్ హీరోయిజం చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్నారు. ఎవరో గుర్తుపట్టారా ?. తనే హీరో తేజ సజ్జా.
తేజ సజ్జా.. తెలుగు సినీ పరిశ్రమలోకి బాలనటుడిగా అడుగుపెట్టారు. 1998లో చూడాలని ఉంది సినిమాతో సినీరంగంలోకి బాలనటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన రాజకుమారుడు, కలిసుందాం రా, యువరాజు, బాచి, సర్దుకుపోదాం రండి, గంగోత్రి వంటి అనేక చిత్రాల్లో బాలనటుడిగా కనిపించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో చిన్ననాటి చిరు పాత్రలో నటించి అదరగొట్టారు తేజ. అలాగే ఠాగూర్ చిత్రంలోనూ చిరు వద్ద పిల్లలలో ఒకరిగా కనిపించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన తేజ.. 2019లో ఓ బేబీ సినిమాతో హీరోగా కనిపించారు.
తేజ సజ్జా ట్వీట్..
He is the power star for the nation, but also the most humble, down to earth man I’ve been around. He had this welcoming, warm aura every time I met him that made my love for him even stronger. Spending time with him is full of fun and unending memories. #HBDPaᴡanKalyan pic.twitter.com/JSzodESrwM
— Teja Sajja (@tejasajja123) September 2, 2020
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. ఆ తర్వాత జాంబీ రెడ్డి సినిమాలో నటించి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన ఇష్క్, అద్భుతం చిత్రాలు థియేటర్లలో కమర్షియల్ హిట్ అందుకోలేకపోయాయి. ప్రస్తుతం తేజ హనుమాన్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
తేజ సజ్జా ట్వీట్..
My SuperHero
My inspiration
The Game Changer
Tha Walking legend
The Philanthropist
The Man of Masses
The MEGASTAR⭐️
HAPPY HAPPY BIRTHDAY TO YOU UNCLE
Love you#HBDMegastarChiranjeevi garu#HBDChiranjeevi garu pic.twitter.com/Qy8Uuhp1qF— Teja Sajja (@tejasajja123) August 22, 2022
ఈరోజు చిరు బర్త్ డే సందర్భంగా ఆయనతో తాను చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తేజ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.
మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తేజ..
My SuperHero
My inspiration
The Game Changer
Tha Walking legend
The Philanthropist
The Man of Masses
The MEGASTAR⭐️
HAPPY HAPPY BIRTHDAY TO YOU
Love you @KChiruTweets garu#HBDMegastarChiranjeevi garu#HBDChiranjeevi garu pic.twitter.com/GC9opELG8r— Teja Sajja (@tejasajja123) August 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.