Tollywood: ఈ ఫోటోలో ఉన్న హీరోను గుర్తుపట్టారా ?.. ఆ స్టార్ పర్సనల్ విషయాలపైనే జనాలకు ఇంట్రెస్ట్ ఎక్కువ..

|

Sep 07, 2023 | 6:36 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో అతను స్టార్ హీరో. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు. 1984లో సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ హీరో.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వస్తున్నారు. గుర్తుపట్టారా ?. అతని సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటారు.

Tollywood: ఈ ఫోటోలో ఉన్న హీరోను గుర్తుపట్టారా ?.. ఆ స్టార్ పర్సనల్ విషయాలపైనే జనాలకు ఇంట్రెస్ట్ ఎక్కువ..
Actor
Follow us on

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ ముగ్గురు చిన్నారుల్లో ఓ స్టార్ హీరో ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో అతను స్టార్ హీరో. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి అలరించారు. 1984లో సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ హీరో.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వస్తున్నారు. గుర్తుపట్టారా ?. అతని సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. ఇక అతని తండ్రి కూడా ఫేమస్ నటుడే. ఆయన నటించిన చిత్రాలు తమిళంలోనే కాకుండా తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నారు. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆ కుర్రాడు మరెవరో కాదు. హీరో శింబు.

తమిళ్ ఫేమస్ నటుడు టీ.రాజేందర్ తనయుడే శింబు. 1983 ఫిబ్రవరి 3న జన్మించారు శింబు. బాలనటుడిగా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి శింబు.. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

సినీ పరిశ్రమలో ఆయన చేసిన సేవలకు గానూ తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి 2022లో డాక్టరేట్ అందుకున్నారు. బిగ్ బాస్ తమిళ్ ఓటీటీకి హోస్ట్ గా వ్యవహరించారు.

అయితే శింబు సినిమాల గురించి కాకుండా తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో పలువురు హీరోయిన్స్ తో ప్రేమ అంటూ శింబుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఈ వార్తలపై ఇప్పటికీ శింబు స్పందించలేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు . తాజాగా ఆయన చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.