సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అంటే అంత సులువు కాదు. ఎంతో మంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు కొంతమంది మంచి స్థాయిలో ఉన్నారు. కష్టాలు అంటే మాములు కష్టాలు కావు.. కృష్ణానగర్ రోడ్ల పై నిత్యం వందల మంది సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేస్తూ కొంతమంది జీవనం సాగిస్తున్నారు. మరికొంతమంది అవకాశాల కోసం సినిమా ఆఫీస్లు చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే పైన కనిపిస్తున్న యాక్టర్ ను చూశారా..? ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..? ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. చిన్న చిన్న షోల దగ్గర నుంచి ఇప్పుడు సినిమాల వరకు ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నాడు, ఇంతకు ఆ పై కనిపిస్తున్న నటుడు ఎవరంటే..
ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను అనుభవించి సినిమాల్లో అవకాశం తెచ్చుకున్నాడు. చిన్న చిన్న షోల నుంచి పెద్ద షోలు.. ఆతర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాడు. అతను ఎవరో కాదు ప్రముఖ కమెడియన్ రచ్చ రవి. తెలంగాణలోని హనుమానకొండకు చెందిన రచ్చ రవి. జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అతని కామెడీ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాడు. చిన్న తనం నుంచి సినిమాల పై ఆసక్తి ఉన్న రచ్చ రవి పలు టీవీ షోల్లో మిమిక్రీ చేసి మెప్పించాడు. కానీ అంతగా సక్సెస్ కాకపోవడంతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేశారు. అదే సమయంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ దగ్గర పని చేశాడు.
ఆతర్వాత అక్కడ మానేసి దుబాయ్ వెళ్ళాడు. అక్కడ రేడియో జాకీగా పని చేశాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడి ప్రేక్షకులను అలరించాడు. ఆతర్వాత తిరిగి ఇండియాకు వచ్చేశాడు. తిరిగి వచ్చిన తర్వాత పలు సీరియల్స్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేశాడు. ఆతర్వాత ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర స్కిట్స్ లో చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రచ్చ రవి. అలాగే తేజ దర్శకత్వంలో వచ్చిన 1000అబద్దాలు సినిమాతో సినిమాల్లోకి అడుగు పెట్టాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో తుపాకీ రాజుగా మెప్పించాడు. ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.