“జైలుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నా”

|

Oct 23, 2020 | 6:22 PM

విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారంటూ  బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ముంబై కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కంగనా...

జైలుకెళ్లేందుకు ఎదురు చూస్తున్నా
Follow us on

విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారంటూ  బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ముంబై కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కంగనా, ఆమె సోదరి రంగోలీపై ముంబైలో కేసు ఫైల్ చేశారు. మరో కేసులో బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు ఆదేశాల మేరకు.. వీరు వచ్చే వారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు ఆదర్శప్రాయులైన గొప్ప వ్యక్తుల మాదిరిగానే.. తాను కూడా జైలుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నానంటూ కంగనా పేర్కొంది. నేతాజీ, వీర సావర్కర్‌ వంటి వారు తనకు ఆదర్శమని.. వారిలా తాను కూడా జైలు జీవితాన్ని ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నానని కంగన ట్వీట్‌ చేసింది. రాణి లక్ష్మీ బాయి కోటను కూలగొట్టినట్టే, తన ఇంటిని కూడా కూల్చేశారని.. వీర సావర్కర్‌ను జైలు పంపించినట్లే, తనను జైలుకు పంపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని కంగనా ఆరోపించింది.

దేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపిస్తున్న వ్యక్తులను ఇక్కడ ఎన్ని బాధలు ఎదుర్కున్నారో ఎవరైనా ప్రశ్నిస్తే బాగుంటుంది అంటూ.. ఆ పోస్టును ఆమిర్‌ ఖాన్‌కు ట్యాగ్‌ చేసింది. దేశంలో అసహనం పెరగడం పట్ల ఆమిర్‌ ఖాన్‌ గతంలో ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ బిడ్డ క్షేమం కోసం ఇండియా‌ విడిచి వెళ్లాలని తన భార్య ప్రతిపాదించినట్టు ఆయన చేసిన ప్రకటన అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది.

Also Read :

కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

టాలీవుడ్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన నిధి!