Viswam First Strike: ట్రెండింగ్ లో దూసుకుపోతున్న గోపీచంద్ విశ్వం ఫస్ట్ స్ట్రైక్

ప్రస్తుతం ఈ ఈ మాచో స్టార్ దర్శకుడు శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ వీడియోను విడుదల చేశారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనెపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్..

Viswam First Strike: ట్రెండింగ్ లో దూసుకుపోతున్న గోపీచంద్ విశ్వం ఫస్ట్ స్ట్రైక్
Viswam Movie

Updated on: Apr 12, 2024 | 6:48 PM

మాచో స్టార్ గోపీచంద్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చివరిగా భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గోపీచంద్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ఈ మాచో స్టార్ దర్శకుడు శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ వీడియోను విడుదల చేశారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనెపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘విశ్వం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.

వధూవరులు పెళ్లి మండపంలోకి రావడం, సంగీత విద్వాంసుల బృందం వివిధ వాయిద్యాలను వాయిస్తూ, పూజారి మంత్రాలు పఠించడం , రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్న చెఫ్‌లు.. ఇలా వివాహ వేడుకలతో ఫస్ట్ స్ట్రైక్ వీడియో ప్రారంభమవుతుంది. గోపీచంద్ పెద్ద గిటార్ కేస్‌ని భుజంపై వేసుకుని పెళ్లి వేదిక వైపు నడుస్తూ ఎంట్రీ ఇచ్చారు. అది గిటార్ కాదు, మెషిన్ గన్. ఆశ్చర్యకరంగా, అతను వధూవరులను, వివాహానికి వచ్చిన అతిథులందరినీ కాల్చడం ప్రారంభిస్తారు. చివరగా, అతను అక్కడ ఫుడ్ ని ఆస్వాదిస్తూ, “దానే దానే పే లిఖా, ఖానే వాలే కా నామ్… ఇస్పే లిఖా మేరే నామ్..’ అని చెప్పడం చాలా పవర్ ఫుల్ అనిపించింది.

లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకునిస్టైలిష్‌గా కనిపించిన గోపీచంద్‌ని నెగెటివ్‌ షేడ్‌లో చూడటం నిజంగా సర్ప్రైజింగ్ గా ఉంది అంటున్నారు ఫ్యాన్స్ . ఆయన చెప్పిన డైలాగ్ చూస్తుంటే.. సినిమాలో గోపీచంద్  క్యారెక్టర్ గ్రే షేడ్లో కనిపిస్తారని అర్ధమవుతోంది. శ్రీను వైట్ల ఫస్ట్ స్ట్రైక్ ని మాస్ ఫీస్ట్ గా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఇది చాలా స్టైలిష్‌గా, ప్రామెసింగ్ గా కనిపిస్తుంది. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో చూపించారు. కేవీ గుహన్‌ నైపుణ్యం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. చైతన్ భరద్వాజ్ స్కోర్ సినిమా సాంకేతికంగా ఎంత రిచ్ గా ఉందో తెలియజేస్తుంది. అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ కన్నుల విందును అందిస్తుంది. మొత్తంమీద, ఫస్ట్ స్ట్రైక్ మాస్ ఫీస్ట్ ని అందించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ ఫస్ట్ స్ట్రైక్. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.