Sitara Ghattamaneni: సితార ఘట్టమనేని పేరును వదలని సైబర్ కేటుగాళ్లు.. మహేష్ టీం హెచ్చరిక..

|

Feb 10, 2024 | 6:56 AM

ఇప్పటికే వివిధ రంగాల్లోని ప్రముఖుల పేర్లతో సైబర్ మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఓటీపీ పేరుతో.. జాబ్ ఆఫర్ లింక్ అంటూ.. గిఫ్ట్ పేరుతోనో ఫోన్లకు లింకులు పంపి.. దాన్ని క్లిక్ చేయడంతోనే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. అలాగే అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపి.. దాన్ని క్లిక్ చేయగానే నగదు కాజేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింక్స్, ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్, ఓటీపీ లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని .. ఇప్పటికే పోలీసులు ఎన్నోసార్లు ప్రజలకు సూచించారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

Sitara Ghattamaneni: సితార ఘట్టమనేని పేరును వదలని సైబర్ కేటుగాళ్లు.. మహేష్ టీం హెచ్చరిక..
Sitara Ghattamaneni
Follow us on

సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకీ మరింత రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలతో రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యుల అమాయకత్వం, అవసరాలు, బలహీనతలతో క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది అమాయకుల ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి… పెద్ద మొత్తంలో పోగొట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం మరింత పెరగడంతో సైబర్ నేరాలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే వివిధ రంగాల్లోని ప్రముఖుల పేర్లతో సైబర్ మోసాలకు పాల్పడ్డారు. అలాగే ఓటీపీ పేరుతో.. జాబ్ ఆఫర్ లింక్ అంటూ.. గిఫ్ట్ పేరుతోనో ఫోన్లకు లింకులు పంపి.. దాన్ని క్లిక్ చేయడంతోనే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. అలాగే అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపి.. దాన్ని క్లిక్ చేయగానే నగదు కాజేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింక్స్, ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్, ఓటీపీ లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని .. ఇప్పటికే పోలీసులు ఎన్నోసార్లు ప్రజలకు సూచించారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరును కూడా వాడుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.

సితార పేరుతో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ… ఇప్పుడు కొత్త మోసానికి తెర తీశారు. ఇన్ స్టాలో ట్రేడింగ్ లింక్స్ పంపి డబ్బులు కాజేస్తున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో మహేష్ బాబు టీం రంగోలికి దిగింది. ఈ మోసాలపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎలాంటి అనుమానస్పద నోటిఫికెషన్స్ కు.. రిక్వెస్టులకు స్పందించొద్దని అభిమానులకు, నెటిజన్లకు మహేష్ టీం రిక్వెస్ట్ చేసింది. ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి రిక్వెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులను హెచ్చరించారు.

సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అంతకు ముందు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసి చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేసింది. కానీ ఇన్ స్టాలో ఇటీవల డాన్స్ వీడియోస్ ఎక్కువగా షేర్ చేస్తుంది. ప్రస్తుతం సితారకు ఇన్ స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాటకు డాన్స్ అదరగొట్టేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.