Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకి స్పెషల్‌గా గ్రీటింగ్స్ చెప్పిన గద్వాల్ జిల్లా అభిమానులు..

|

Aug 21, 2021 | 6:56 AM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో చెరగని సంతకం. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. ఈరోజు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఆగస్ట్ 22. దీంతో..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకి స్పెషల్‌గా గ్రీటింగ్స్ చెప్పిన గద్వాల్ జిల్లా అభిమానులు..
Chiru
Follow us on

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో చెరగని సంతకం. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. ఈరోజు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఆగస్ట్ 22. దీంతో అభిమానులు తమ అభిమాన హీరో చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ.. పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. అయితే జోగులాంబ గద్వాల్ జిల్లా కు చెందిన ముగ్గురు యువకులు చిరుపై తమ అభిమానాన్ని డిఫరెట్ గా తెలియజేస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు వివరాల్లోకి వెళ్తే..

జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రవి, వీరేష్, రాజ్ అనే ముగ్గురు యువకులు మెగా వీరాభిమానులు. ఇక్కడికే 231 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్ ను కలిసిన ఈ యువకులు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు. కాగా, తమ అభిమాన హీరోకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనున్నారు. అందుకోసం డ్రోన్ షాట్ లో ఓ చిరు ఫోటో కనిపించేలా నేల మీద గడ్డితో ఆకారాన్ని చెక్కించి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

చిరంజీవి తన అభిమానులను మెగా బ్లడ్ బ్రదర్స్ గా ట్రీట్ చేస్తారన్న సంగతి తెలిసిందే.. స్వయం కృషితో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ ప్రేక్షకులకు కొత్త హీరోయిజాన్ని పరిచయం చేశారు చిరు.

ఇప్పటికీ చిరంజీవి తాను నటించే ప్రతి సినిమాను మొదటి సినిమా భావిస్తారని టాక్ కూడా.. టాలీవుడ్ లో 40 ఏళ్ల సినిమా కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించారు.. ఫ్యాన్స్ ను సేవా కార్యక్రమాల వైపు నడిపిన ఘనత కూడా మెగాస్టార్ చిరంజీవి కే సొంతమని చెప్పవచ్చు.. మరి చిరంజీవి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆచార్య సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా.. వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.

Also Read: Chanakya Niti: ఏ బంధమైనా నిలబడాలంటే ఏమి చెయ్యాలో చాణక్య చెప్పిన మూడు జల్లెడల కథ