గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేని క్లాసిక్ లవ్ స్టోరీలలో ఒకటి 'కొత్త బంగారు లోకం'. అందులోని గోల్డెన్ స్టార్ట్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. ఆ సినిమాలో 'స్వప్న' పాత్రలో తన సహజ నటన, అమాయకత్వంతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె సినీ ..

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కొత్త బంగారు లోకం హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Kotha Bangaru Lokam Heroine

Updated on: Dec 10, 2025 | 10:34 AM

తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేని క్లాసిక్ లవ్ స్టోరీలలో ఒకటి ‘కొత్త బంగారు లోకం’. అందులోని గోల్డెన్ స్టార్ట్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. ఆ సినిమాలో ‘స్వప్న’ పాత్రలో తన సహజ నటన, అమాయకత్వంతో కుర్రకారును ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె సినీ ప్రయాణం ఒడిదుడుకులతో సాగినా, ఇప్పుడు ఆమె తన కెరీర్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమె జీవనశైలి చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

ఆ స్వప్న ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, వెబ్ సిరీస్‌లు, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే, ఆమె ఇప్పుడు తన పని పట్ల చూపిస్తున్న వైఖరి… ఆమెను పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మార్చేసింది! అసలు ఇంతకీ ఆమె జీవితంలో వచ్చిన ఆ మార్పు ఏమిటి?

ఇంట్లో ఉండడమే సుఖం!

ప్రస్తుతం OTT ప్రపంచంలో ‘మహారాణి’ వంటి ప్రముఖ వెబ్ సిరీస్‌లో మెరిసిన శ్వేతా బసు ప్రసాద్, పని విషయంలో చాలా ఎంపికగా ఉంటానని స్వయంగా ప్రకటించింది. ఆమె చెబుతున్న మాటలు వింటే, సినీ పరిశ్రమలోని ఇతర నటుల కంటే ఆమె ఎంత భిన్నంగా ఆలోచిస్తుందో అర్థమవుతుంది.

తన వద్దకు వచ్చే పది ప్రాజెక్టులలో తొమ్మిదింటికి తాను ‘నో’ చెబుతానని శ్వేత వెల్లడించింది. తన అభిరుచికి తగిన పాత్రల కోసం ఆమె నిరంతరం ఎదురుచూస్తుంటుంది. పని లేకపోయినా, ఆరు నెలల పాటు ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడానికి కూడా తాను సిద్ధమేనని, మంచి ప్రాజెక్ట్ వచ్చేవరకు వేచి చూస్తానని ఆమె ధైర్యంగా చెప్పింది.

Swetha Basu Prasad

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే నిరంతరం బిజీగా ఉండాలి, పబ్లిక్‌లో కనిపించాలి అనే ఒత్తిడి ఉంటుంది. కానీ శ్వేత ఈ ఒత్తిడికి దూరంగా ఉండడానికి ఒక ఆశ్చర్యకరమైన కారణాన్ని చెప్పింది. “నా జీవితంలో నాకు ఖర్చులు అంతగా లేవు, ఎవరి అంచనాల కోసమో నేను జీవించాల్సిన అవసరం లేదు. నా సహోద్యోగులను గౌరవిస్తూనే చెబుతున్నా, నేను నిరంతరం ఫోటోషూట్‌లు, పార్టీలలో చురుకుగా ఉండాలనే ఒత్తిడిని తీసుకోను. ఆ జీవనశైలికి నేను దూరంగా ఉంటాను.

అందుకే, నేను కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లి, నాకు మంచి పని వచ్చినప్పుడు మళ్లీ బయటకు రావడం నాకు చాలా సులభం.” అని చెప్పుకొచ్చింది శ్వేత. ఈ మాటలు శ్వేత ఎంత పరిణతి చెందిందో తెలియజేస్తున్నాయి. డబ్బు, పేరు కోసం కాకుండా, సంతృప్తికరమైన పాత్ర కోసం ఆరు నెలలు ఖాళీగా ఉండడానికైనా వెనుకాడని ఆమె వైఖరి… పాత ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్, ఇప్పుడు తనకంటూ ఒక కొత్త, ప్రశాంతమైన లోకాన్ని సృష్టించుకుందని స్పష్టం చేస్తోంది. ఆమె ప్రేక్షకులను అభిమానించే నటి కంటే, ముందుగా ఆడియన్స్‌గానే ఉంటానని చెప్పడం ఆమె ఎంపికల వెనుక ఉన్న నిజాయితీకి నిదర్శనం.