Actress Jayashree Suicide: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ ఫేమ్ జయశ్రీ ఆత్మహత్య.. తీవ్ర ఒత్తిడితో..!

 కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకుంది. నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జయశ్రీ రామయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి బెంగళూరులోని...

Actress Jayashree Suicide: షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ ఫేమ్ జయశ్రీ ఆత్మహత్య.. తీవ్ర ఒత్తిడితో..!

Updated on: Jan 25, 2021 | 3:46 PM

Actress Jayashree Suicide: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకుంది. నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జయశ్రీ రామయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన ఇంట్లో ఉరేసుకుని తనువు చాలించింది. ఒత్తిడి‌ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఫ్రెండ్స్ చెబుతున్నారు.  కాగా గతేడాది జూలై 22న ఆమె తీవ్ర మానసిన వ్యధ అనుభవిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వెంటనే సదరు పోస్టును తొలగించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని, ఎవరూ కంగారు పడొద్దని కోరింది.

ఆ పోస్ట్ చేసిన ఐదు రోజులకే ఫాలోవర్స్‌తో లైవ్‌లో ముచ్చటించిన జయశ్రీ తన మనసులో ఉన్న బాధను పంచుకుంది. తాను ఇదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదని..హీరో సుదీప్‌ సర్‌ నుంచి ఆర్థిక సాయం కోరట్లేదని పేర్కొంది. తన చావును మాత్రమే కోరుకుంటున్నాని.. ఒత్తిడితో వేగలేకపోతున్నాని వెల్లడించింది. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ.. మానసిక ఒత్తిడిని మాత్రం భరించలేకపోతున్నాని వివరించింది. వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నాయని.. చిన్నప్పటి నుంచి అవి వీడటం లేదని తెలిపింది. ఇటీవల కూడా ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఆమె కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా వ్యవహరించిన కన్నడ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొంది.

Also Read: సింగర్ సునీత-రామ్‌ల ‘వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’.. అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..