Devil Movie: సోషల్ మీడియాలో ‘డెవిల్’ ట్రెండ్.. ‘మాయ చేశావే’ సాంగ్ హిట్ కావడానికి కారణమేంటో తెలుసా..

|

Sep 23, 2023 | 9:42 AM

కళ్యాణ్ రామ్ విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

Devil Movie: సోషల్ మీడియాలో డెవిల్ ట్రెండ్.. ‘మాయ చేశావే’ సాంగ్ హిట్ కావడానికి కారణమేంటో తెలుసా..
Devil Movie
Follow us on

బింబిసార సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక అదే జోరులో అమిగోస్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. కానీ ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. అయినా కళ్యాణ్ రామ్ విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇటీవల విడుదలైన ‘మాయ చేశావే’ సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను మరింత అందంగా ప్రేక్షకులను చూపించింది. 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాచరు. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించినట్లుగా సాంగ్ విజువల్స్ చూస్తే తెలుస్తోంది. ఈ పాటలోని కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటి కాలాన్ని.. సంగీతాన్ని బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరించేందుకు దక్షిణాదిలోనే లొకేషన్లను ఎంచుకున్నట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ పాటలను కారైకుడిలోని ప్యాలెస్‌లో చిత్రీకరించారు.

ముఖ్యంగా ఈ పాటలో హైలెట్ అయ్యింది సంగీతం. ఈ విషయంలో మాత్రం దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ఇద్దరూ కలిసి ఇలాంటి వింటేజ్ సాంగ్‌ను క్రియేట్ చేశారు. ఈ పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాట కోసం ఉపయోగించారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లారు. ఈ చిత్రాన్ని నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.