Pawan Kalyan: ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. ఫస్ట్ పోస్ట్ ఏంటో చూశారా?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. మరీ ముఖ్యమైన ఫంక్షన్లు, ఈవెంట్స్ ఉంటే తప్ప ఆమె పెద్దగా బయటకు రారు. ఇక కాసేపటి క్రితం వరకు ఆమెకు ఎలాంటి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు.

Pawan Kalyan: ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. ఫస్ట్ పోస్ట్ ఏంటో చూశారా?
Pawan Kalyan Wife Anna Lezhneva

Updated on: Mar 25, 2026 | 6:45 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా ఎట్ట‌కేల‌కు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం (మార్చి 25) anna.konidala పేరుతో అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ప‌వ‌న్ తో దిగిన ఒక క్యూట్ ఫొటోను షేర్ చేసిన అన్నా లెజినోవా.. ‘చాలా కాలం నుంచి ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాను. అందుకు ఇదే సరైన సమయం అనిపించింది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో , పవన్ కల్యాణ్ సపోర్టు తో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తన పోస్టులో రాసుకొచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులతో పాటు, ఇతర సెలబ్రిటీలను కూడా అనుసరించింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ , సమంత, అలియా భట్ తదితర స్టార్స్ కూడా ఉన్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా తన భార్యకు స్వాగతం చెబుతూ ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.. ‘అన్నా లెజినోవా’ కి మనస్ఫూర్తిగా ఇన్ స్టాగ్రామ్ లోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ స్పేస్ లోకి వచ్చినందుకు మీకు ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో నీ విలువైన ఆలోచనలను ఈ స్పేస్ ద్వారా ఎలా పంచుకోబోతున్నావో తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలంగా ఉంది’ అని రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.

కాగా అన్నా లెజినోవా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ఆమె అలా ఇన్ స్టా గ్రామ్ ఖాతా ఓపెన్ చేసిందో లేదు కానీ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటివరకు సుమారు 157K (ఒక లక్ష 57 వేల మంది) అన్నా లెజినోవాను ఫాలో అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

అన్నా లెజినోవా మొదటి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ఇదే..

ఇక ర‌ష్యా మోడ‌ల్‌, న‌టి అయిన అన్నా లెజినోవాను ప‌వ‌న్ కల్యాణ్ 2013 సెప్టెంబ‌ర్ 30న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు, పోలెనా అంజనా పవనోవా అనే కూతురు ఉన్నారు.

భార్యకు వెల్కమ్ చెబుతూ పవన్ కల్యాణ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us