మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై సినీ ఇండస్ట్రీ, మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రములుకు ప్రార్ధనలు చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో సాయిధర్మతేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారు. గ్రామంలో ముంగర్లమ్మవారి గుడివద్ద సాయిధర్మతేజ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అభిమానులు. తేజ్ కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యామని అంటున్నారు అభిమానులు. ఆ విఘ్నేశ్వరుడు, అమ్మవారి కృప సాయి ధర్మతేజ్‌కు ఉండి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు అభిమానులు.
అలాగే విజయవాడ వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థలో తేజ్ కోసం ప్రార్థలు కొనసాగుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆశ్రమంలోని వృద్ధులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదమేమీ లేదని వైద్యులు పేర్కొన్నారు. వచ్చే 24 గంటల్లో మళ్లీ పరీక్షలు చేస్తామని అపోలో డాక్టర్లు చెప్పారు. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని.. 72గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచుతున్నట్లు అపోలో వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :