సుశాంత్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని పిటిషన్

|

Sep 13, 2020 | 5:17 PM

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణానికి సంబంధించి ఇప్పటికే సీబీఐతో పాటు ఎన్.సీ.బీ దర్యాప్తు ముమ్మరం చేశాయి.

సుశాంత్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని పిటిషన్
Follow us on

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణానికి సంబంధించి ఇప్పటికే సీబీఐతో పాటు ఎన్.సీ.బీ దర్యాప్తు ముమ్మరం చేశాయి. మరోవైపు సుశాంత్ అభిమానులు అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో సుశాంత్ సింగ్  మైనపు బొమ్మ ఏర్పాటు చేయాలని అతడి అభిమానులు ఆన్ లైన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అందుకోసం ఛేంజ్.ఓఆర్ జీలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుశాంత్ ఫ్యాన్స్ దీనిపై సంతకం చేయాలని వారు సూచిస్తున్నారు. 2 లక్షల మందితో సదరు పిటిషన్ పై సంతకం చేయించాలని వారు పట్టుదలతో ఉన్నారు. దీనిపై ఇప్పటికే 1.7 లక్షల మంది సైన్ చేశారు. లండన్ కు చెందిన సోఫి రెహమాన్ అనే  మహిళ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుశాంత్ ను ఎప్పుడూ స్మరించుకోవాలంటే లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతడి మైనపు బొమ్మ ఏర్పాటు చేయాలని చెబుతున్నారు.

Also Read :

దొంగతనానికిి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు

“వెయిటర్‌గా పనిచేస్తున్నప్పుడు, టిప్పుగా ఓ మహిళ కిస్ పెట్టింది”

బైక్‌ల చోరీలు : వీళ్ల రూటే సెపరేట్ !