Nidhi agarwals : సోషల్ సర్వీస్ ప్రారంభించిన ఇస్మార్ట్ బ్యూటీ.. అందంతో పాటు అభినయంలో కూడా తక్కువేం కాదు..
Nidhi agarwals : చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్. తన అందం, నటనతో
Nidhi agarwals : చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్. తన అందం, నటనతో యవతను ఉర్రూతలూగిస్తుంది. చాలా కొద్ది మంది నటులకు మాత్రమే ఇలాంటి భాగ్యం కలుగుతుంది. తాజాగా ఆమె నటనతో పాటు సోషల్ సర్వీస్‌లో కూడా తాను ముందువరుసలో ఉంటానని నిరూపించింది. మరోసారి అందరి చేత ప్రశంసలు అందుకుంది.
కాగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్న నిధి.. ఈ సినిమా సెట్స్‌లో ‘హెల్పింగ్ హ్యాండ్స్ వెంకట్’ అనే స్వచ్ఛంధ సంస్థకు చెందిన టీమ్‌ను కలిసింది. గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించే వెంకట్ అండ్ టీమ్.. పేదలకు సేవ చేయడంలో ముందుంటారని తెలిపింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఫుడ్ డొనేషన్ డ్రైవ్స్, జంతువుల సంరక్షణ కార్యక్రమాలు చేపడతారని చెప్పింది. తను చేసే సోషల్ సర్వీస్‌కు మద్దతిస్తున్నానని, అభిమానులు కూడా సపోర్ట్ చేయాలని కోరింది నిధి.
ఇదిలా ఉంటే వాలైంటైన్స్ డే రోజున తమిళనాడులో నిధి అగర్వాల్‌కి గుడి కట్టిన విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం కానుకగా తమిళనాడులో ఓ చోట నిధి అగర్వాల్ విగ్రహానికి, కొందరు తెలుగు, తమిళ ఫ్యాన్స్ పాలతో అభిషేకం చేశారు. ఆ ఫొటోల్ని కొందరు నిధికి సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు. ఈ అనూహ్య పరిణామంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. గతంలో తమిళంలో ఎమ్జీఆర్, ఖుష్బూ, నమిత, హన్సిక లాంటి పలువురు నటీనటులకు గుడి కట్టారు.
CM KCR : మహిళా ఉద్యోగులకు ఒక్క రోజు సెలవు.. ఉమెన్స్ డే సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..