Aha: ఆహాలో అదరగొట్టనున్న ఫ్యామిలీ ధమాకా.. విశ్వక్ సేన్ హోస్ట్ గా నయా షో

|

Sep 11, 2023 | 2:26 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. ఆ షో ఏదో కాదు.. అందరిలో ఎంతో ఆతృతను పెంచేలా చేసిన షో ‘ఫ్యామిలీ ధమాకా’. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ‘ఫ్యామిలీ ధమాకా’ అనేది కేవలం షో మాత్రమే కాదు. కుటుంబాల మధ్య జరిగే పండుగలాంటిది. ఈ ఫ్యామిలీ ధమాకాకు విశ్వక్ సేన్ హోస్ట్‌గా వ్యవహరించటం వల్ల సరికొత్త ఛరిష్మాను తీసుకొచ్చారు. విశ్వక్ సేన్ గురించి మన ఆడియెన్స్‌కు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్ రెడీ మన వాళ్ల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. తను ఈ ఫ్యామిలీ ధమాకాను హోస్ట్ చేయటం అనేది వీక్షకులకు ఓ నవ్వుల ప్రయాణంలా ఉంటుంది.

Aha: ఆహాలో అదరగొట్టనున్న ఫ్యామిలీ ధమాకా.. విశ్వక్ సేన్ హోస్ట్ గా నయా షో
Family Dhamaka
Follow us on

తెలుగు కంటెంట్ తో ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంటున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు, అలరించే గేమ్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆహా. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. ఆ షో ఏదో కాదు.. అందరిలో ఎంతో ఆతృతను పెంచేలా చేసిన షో ‘ఫ్యామిలీ ధమాకా’. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ‘ఫ్యామిలీ ధమాకా’ అనేది కేవలం షో మాత్రమే కాదు. కుటుంబాల మధ్య జరిగే పండుగలాంటిది.

ఈ ఫ్యామిలీ ధమాకాకు విశ్వక్ సేన్ హోస్ట్‌గా వ్యవహరించటం వల్ల సరికొత్త ఛరిష్మాను తీసుకొచ్చారు. విశ్వక్ సేన్ గురించి మన ఆడియెన్స్‌కు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్ రెడీ మన వాళ్ల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. తను ఈ ఫ్యామిలీ ధమాకాను హోస్ట్ చేయటం అనేది వీక్షకులకు ఓ నవ్వుల ప్రయాణంలా ఉంటుంది. ఓటీటీలో హోస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విశ్వక్ ఇదొక కీలకమైన ప్రారంభం అనే చెప్పాలి. తను ప్రతిభతో రోజు రోజుకీ తన విస్తృతిని పెంచుకుంటూ వెళుతున్నారు. తను ఆడియెన్స్‌ను అలరిస్తారనే దానికి ఆహా ఎంత నమ్మకంగా ఉందో చెప్పటానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు.

‘ఫ్యామిలీ ధమాకా’లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షోలో రకరకాల సవాళ్లు ఉండనున్నాయి. ఇవెంతో ఉల్లాసంగా ఉండబోతున్నాయి. అలాగే భావోద్వేగాల కలయికగా ఓ రోలర్ కోస్టర్‌లా ఈ షో ఆకట్టుకోనుంది. ఈ ఇంట్రెస్టింగ్ గేమ్ షోకు విశ్వక్ సేన్ తోడవ్వడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌కి మరింత ఊపొచ్చింది.

ఫ్యామిలీ ధమాకాను ప్రారంభించటానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి విశ్వక్ సేన్ సరికొత్త అర్థాన్ని చెప్పబోతున్నారనేది పక్కా. మీ కుటుంబాలకు విశ్వక్ సేన్ సరికొత్త ధమాకాను అందించబోతున్నారు. ఇచ్చి వినోదంతో పాటు తెలియని ఉత్సాహాన్ని అందించనుంది. ‘ఫ్యామిలీ ధమాకా’ సెప్టెంబర్ 8న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.