Fahadh Faasil : షూటింగ్ లో గాయపడిన హీరో.. బిల్డింగ్ పైనుంచి కిందపడటంతో గాయాలు.. ప్రమాదంలో..

షూటింగ్ సమయంలో హీరోలు హీరోయిన్లు గాయపడటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. రిస్కీ షాట్స్ తీస్తున్న సమయంలో చాలా మంది హీరోలు తీవ్రంగానే గాయపడ్డారు.

Fahadh Faasil : షూటింగ్ లో గాయపడిన హీరో.. బిల్డింగ్ పైనుంచి కిందపడటంతో గాయాలు.. ప్రమాదంలో..

Updated on: Mar 04, 2021 | 11:48 AM

Fahadh Faasil : షూటింగ్ సమయంలో హీరోలు హీరోయిన్లు గాయపడటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. రిస్కీ షాట్స్ తీస్తున్న సమయంలో చాలా మంది హీరోలు తీవ్రంగానే గాయపడ్డారు. తాజాగా మరో హీరో కూడా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. మలయాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ షూటింగ్ స‌మ‌యంలో బిల్డింగ్ పై నుండి కింద ప‌డ్డాడు. మ‌ల‌య‌న్ కుంజ్ అనే చిత్ర షూటింగ్‌లో ఈ ప్ర‌మాదం జరిగిందని తెలుస్తుంది.

అయితే ఈ ప్రమాదంలో ఆయనకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. బిల్డింగ్ పై నుండి కిందపడిన వెంటనే యూనిట్ సభ్యులు అతడిని కొచ్చిలోని ఓ ప్రయివేట్  హాస్పటల్ కు తీసుకువెళ్లారు. ప్ర‌మాదంలో ఫాహ‌ద్ ఫాజిల్ ముక్కుకు గాయాల‌య్యాయ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు  తెలిపారు. బెంగ‌ళూరు డేస్, ట్రాన్స్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫహ‌ద్. హీరోయిన్ న‌జ్రియాను ఫహ‌ద్ పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. ఇక న‌జ్రియా త్వరలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయంకాబోతుంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే సుంద‌రానికి’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shreya Ghoshal : ఆనందంలో తేలిపోతున్న అందాల సింగర్.. తల్లికాబోతున్నానని తెలిపిన శ్రేయ ఘోషాల్

ఐటీ దాడులు జరగడానికి ముందు ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఎవరిని కలుసుకున్నారంటే “