Tollywood సోషల్ మీడియాలో హీరోల సందడి మాములుగా ఉండదు. చిన్న పోస్ట్ పెడితే చాలు క్షణాల్లో లైకుల వర్షం కురిపిస్తారు అభిమానులు. ఇక హీరోలకు సోషల్ మీడియాలో భారీ అభిమానగణం ఉంటుంది. అయితే టాలీవుడ్‌లో ఏ హీరో ర్యాంక్ ఎంతో ఇప్పుడు చూద్దాం. అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి. మహేష్ సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. మహేష్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్‌లో మహేష్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 11.6 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇక ఫేస్‌బుక్‌లోనూ మహేష్ బాబును చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో 15 మిలియన్ల ఫాలోవర్ల మార్కును చేరుకున్నాడు. అయితే మహేష్ కంటే ముందు ఇద్దరు హీరోలు ఉన్నారు. ఫేస్‌బుక్‌లో మొదటి స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొనసాగుతున్నాడు. డార్లింగ్ సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమా అప్డేట్స్‌ను నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు ప్రభాస్. ఈ క్రమంలో ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతాలో 24 మిలియన్ల మంది ఉన్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. బన్నీని ఫేస్‌బుక్‌లో 21 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.
ఆతర్వాత పది మిలియన్ దాటినా వాళ్లలో మరో ఇద్దరు హీరోలు ఉన్నారు. వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మెగా హీరోను సోషల్ మీడియాలో 12 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఆ తర్వాత ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఈ యాంగ్ హీరోకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఫేస్ బుక్‌లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత నాని 7 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 6 మిలియన్ ఫాలోవర్స్‌తో దూసుకుపోతున్నారు. ఆ తర్వాత చిరంజీవి (5),రానా (4), రామ్ పోతినేని (3.9), వరుణ్ తేజ్ (3) మిలియన్ ఫాలోవర్స్‌తో ఉన్నారు. అయితే ఊహించని విధంగా అందరికంటే చివరిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పవన్ యాక్టివ్‌గా ఉన్నపటికీ.. ఆయనను ఫేస్ బుక్‌లో 7 లక్షల మంది మాత్రమే ఫాలోవర్స్ ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :