సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఎవరు’: మూవీ రివ్యూ..!

టైటిల్: ఎవరు నటులు: అడవి శేషు, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర, మురళి శర్మ దర్శకత్వం: వెంకట్ రామ్ జీ నిర్మాతలు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె సంగీతం: శ్రీచరణ్ పాకాల విడుదల తేదీ: 15-08-2019 టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అడవి శేషు.. చిన్నచిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చారు. క్షణం, గూఢచారీ.. సినిమాల్లో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న అడవీ శేషు.. మరో సినిమాతో ప్రేక్షకులకు థ్రిల్లర్ చూపించేందుకు మన ముందుకు వచ్చేశారు. […]

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఎవరు: మూవీ రివ్యూ..!

Edited By:

Updated on: Aug 15, 2019 | 11:44 AM

టైటిల్: ఎవరు
నటులు: అడవి శేషు, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర, మురళి శర్మ
దర్శకత్వం: వెంకట్ రామ్ జీ
నిర్మాతలు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
సంగీతం: శ్రీచరణ్ పాకాల
విడుదల తేదీ: 15-08-2019

టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అడవి శేషు.. చిన్నచిన్న సినిమాల్లో నటిస్తూ వచ్చారు. క్షణం, గూఢచారీ.. సినిమాల్లో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న అడవీ శేషు.. మరో సినిమాతో ప్రేక్షకులకు థ్రిల్లర్ చూపించేందుకు మన ముందుకు వచ్చేశారు. మరి ‘ఎవరు’ సినిమా ఎలా ఉంది..? ట్రైలర్‌లో ఆ సస్పెన్స్ ఏంటి..? తెలుసుకోవాలంటే.. కథలోకి వెళ్లాల్సిందే.

కథ:

బిజినెస్ మ్యాగ్నెట్ రాహుల్ భార్య రెజీనా.. నవీన్‌ చంద్రను హత్య చేస్తుంది. తనను అత్యాచారం చేసినందకు అతన్ని చంపానని రెజీనా అంటుంది. అటు.. రెజీనాకు వ్యతిరేకంగా ఓ లాయర్ కోర్టులో వాదించడానికి రెడీ అవుతాడు. ఈ నేపథ్యంలో.. రెజీనా కూడా తనపై కేసును వీక్‌ చేయాలని.. పోలీస్ ఆఫీసర్ అయిన అడివిశేషుకి డబ్బులు ఇస్తుంది. అనుకోకుండా.. అప్పుడే మరో సస్పెన్స్‌ తెరమీదకు వస్తుంది. ఏడాది క్రితం తప్పిపోయిన మురళివర్శను వెత్తుకుంటూ.. అతని కొడుకు వస్తాడు..? ఈ కేసులో.. రెజీనా హస్తం కూడా ఉంటుంది. ఈ సస్పెన్స్‌లోనే రెజీనా నిజంగానే నవీన్‌ చంద్రను చంపిందా..? అనే డౌట్ కూడా వస్తుంది. అసలు రెజీనా, మురళీవర్శకు సంబంధం ఏంటి..? నవీన్ చంద్రను హత్య చేసింది ఎవరు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీగా ‘ఎవరు’ సినిమాని తెరకెక్కించారు. నవీన్‌ చంద్రను హత్య చేసింది ఎవరు..? అనేది సినిమా మొత్తం నడుస్తోంది. హత్య చేసింది ఎవరో తెలియకుండా సన్నివేశాలను ఆసక్తికంగా తెరకెక్కించారు. ఈ విషయంలో డైరెక్టర్ వెంకట్, అడవిశేషులు విజయం సాధించారనే చెప్పవచ్చు. ఒక్కో పాత్రను మలచిన తీరు.. సన్నివేశాలు సాగకుండా తీసిన విధానం నిజంగా సినిమాకి హైలెట్స్‌గా నిలిచాయి. ఎవరు విలనో.. ఎవరు హీరోనో సినిమా ఎండ్ వరకూ తెలీదనే చెప్పాలి. ఇక సీన్లకు తగ్గట్టుగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా సాగింది. సమస్యల్లో చిక్కుకున్నప్పుడు.. మనం నమ్మకం కోల్పోకుండా.. పోరాటం చేయాలనే ట్యాగ్ లైన్ మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. అది ఈ సినిమాలో బాగా హైలెట్ చేసి చూపించారు. సాధించేంత వరకూ.. మరణించకూడదు.. అనే డైలాగ్స్ ప్రేక్షకుల మీద బాగా ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంది సినిమా. అక్కడక్కడ కాస్త లాజిక్స్ మిస్‌అయినా.. థ్రిల్లర్ అంటే ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేయవచ్చు.

కాగా.. సమీర పాత్రలో రెజీనా.. ఆశ్చర్యవంతంగా నటించింది. ఆమె పాత్ర సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తూ.. సస్పెన్స్‌కి గురిచేస్తుంది. ఇక అడవిశేషు, నవీన్‌ చంద్రలు వాళ్ల వాళ్ల పాత్రల్లో యథావిధిగా సూపర్‌గా నటించారు.

ప్లస్ పాయింట్స్:

1. స్క్రీన్‌ ప్లే
2. సినిమాటోగ్రఫీ
3. పాత్రలను మలచిన తీరు
4. బ్యాగ్రౌండ్ స్కోర్
5. థ్రిల్లర్

మైనస్ పాయింట్స్:

1. లాజిక్ లేని సన్నివేశాలు
2. కామెడీ లేకపోవడం