
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారన్న వార్తలకు మరోసారి బలం చేకూరింది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని వీరు జంటగా పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా తరుణ్ భాస్కరే తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అయితే ఈ పోస్టుకు తరుణ్ ఎలాంటి క్యాప్షన్ రాయలేదు. ఈషా కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ, తమ రిలేషన్ షిప్ గురించి ఇలా హింట్ ఇస్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. దీనికి తోడు మంచు లక్ష్మి, ప్రగతి, శివాత్మిక, షాలిని కొండెపూడి లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా వీరికి ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ అని విషెస్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోనున్నారని నెటిజన్లు కూడా ఈషా- తరుణ్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.
కాగా గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసే కనిపిస్తున్నారు. పలు సినిమా కార్యక్రమాలకు, ఈవెంట్లకు వీరిద్దరూ జంటగా హాజరవుతూనే ఉన్నారు. అంతేకాకుండా, తరుణ్ తల్లితో కలిసి ఈషా విమానాశ్రయాల్లో, షాపింగ్‌లో కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. కాగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం మొదలై, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని టాక్. అయితే ఇప్పటివరకు తమ ప్రేమ, పెళ్లి వార్తలపై తరుణ్ గానీ, ఈషా గానీ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. గతంలో ఓ సందర్భంలో ఇషాతో డేటింగ్ రూమర్లపై తరుణ్ భాస్కర్ మాట్లాడాడు. ఈషా తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదని, తన బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరని పేర్కొన్నారు. సరైన సమయంలో అన్ని విషయాలు వెల్లడిస్తానని కూడా తరుణ్ తెలిపారు. ఇప్పుడు కలిసి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా ఈషా, తరుణ్ తమ రిలేషన్ షిప్ పై ఓపెన్ అయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి