
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమన్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అనే చెప్పాలి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఇరగదీశారు. ఆయన లుక్స్, యాక్షన్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ఇక ఈ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్స్ భారీగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఓజీ సినిమా ఏకంగా వైరల్డ్ వైడ్ గా రూ. 154 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సినిమాలో ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు పవన్.
థియేటర్స్ దగ్గరా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. థియేటర్స్ లో ఈలలు, గోలలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓజీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన స్పీచ్ తో అదరగొట్టారు. అలాగే ఈ ఈవెంట్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు పవన్ కళ్యాణ్. డిస్ట్రిబ్యూటర్స్ కు మెమెంటోలు అందజేశారు. ఈ క్రమంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ కాళ్లకు ఉన్న చెప్పులు తీసేసి.. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే పవన్ కళ్యాణ్ ఆయనను ఆపేసి.. వొద్దు అని ఆపేసి.. వెళ్లి చెప్పులేసుకొని రమ్మన్నారు. ఆయన వెళ్లి చెప్పులేసుకు వచ్చిన తర్వాత పవన్ మెమెంటో అందజేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
ఇక ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి సినిమాకి ఒకే రకంగా కష్టపడి పని చేస్తాం రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. ఓజి సినిమా యూనిట్ సభ్యుల అందరి సమిష్టి కృషి వల్లనే ఇంత ప్రజాదరణ పొందింది. ఓజీ యూనివర్సిటీ నేను భాగం కాదల్చుకున్నాను అది ఫ్రీక్వెలా సీక్వెలా అనేది సుజిత్ తమన్లతో మాట్లాడక నిర్ణయం అవుతుంది. అయితే కొన్ని కండిషన్లకు లోబడి మాత్రమే చేయడం జరుగుతుంది అందరి అభిమానులకు ఒక విజ్ఞప్తి ఫ్యాన్ వార్ ని ఆపేయండి. మంచి సినిమాలని చంపకండి అందరి హీరోల సినిమాల్ని ఆదరించండి. మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.