AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: “అదంతా అప్పుడండీ..నేనిప్పుడు మారిపోయాను..”

ఆర్జీవీ చెప్పిందేదీ నమ్మబుద్ధి కాదబ్బా..! ఆయన రాత్రి చెప్పిన మాట పొద్దున్నే మార్చేస్తుంటాడు.. ఆ జీవి మాటలు నమ్మితే నట్టేట మునిగినట్లే..! వర్మపై ఇండస్ట్రీలో ఉన్న ఒపీనియన్ ఇది. దాన్నిప్పుడు మార్చేయాలని ప్లాన్ చేస్తున్నారు వర్మ. రాజాలో వెంకటేష్‌లా అదంతా అప్పుడండీ.. ఇప్పుడు నేను మారిపోయానండీ అంటున్నాడు. మరి వర్మ నిజంగానే మారిపోయారా..?

RGV: అదంతా అప్పుడండీ..నేనిప్పుడు మారిపోయాను..
Ram Gopal Varma
Ram Naramaneni
|

Updated on: Jan 21, 2025 | 2:28 PM

Share

నేనింతే.. అంతా నాయిష్టం.. మనల్నెవడ్రా ఆపేది.. ఇదిగో ఇలాంటి టైటిల్స్ అన్నీ రామ్ గోపాల్ వర్మకు బాగా సూట్ అవుతాయి. ఎవరేం చెప్పినా.. తాను అనుకున్నదే చేస్తుంటారు ఆర్జీవీ. అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసారు ఈ దర్శకుడు. అలాంటిదిప్పుడు ఈయనలో మార్పు మొదలైంది.. ఇకపై మంచి సినిమాలే చేస్తా.. చేయకపోతే చంపేయండి అంటున్నారు.

సత్య సినిమా 27 ఏళ్ళ తర్వాత రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సినిమాను చూసిన వర్మ.. భావోధ్వేగానికి గురయ్యారు. కన్నీళ్ళు పెట్టుకుంటూ ట్విట్టర్‌లో పెద్ద లేఖ రాసారు. సత్య, రంగీల తర్వాత తన కళ్లు నెత్తికెక్కాయని.. అంత గొప్ప సినిమాలు తీసిన తాను.. ఎంతో చెత్త కూడా తీసానని గుర్తొచ్చి కన్నీళ్లు ఆగట్లేదన్నారు RGV.

ఇకపై గౌరవాన్ని పెంచే సినిమాలు చేస్తానని మాటిచ్చారు వర్మ. బ్రాండ్ న్యూ వర్మను చూస్తారంటూ ప్రమాణం చేసారు. ఒకవేళ అలా చేయకపోతే.. తన తలలో పిస్టల్ గురిపెట్టి షూట్ చేసి చంపేయండంటున్నారు వర్మ. మరి ఈ దర్శకుడిలో వచ్చిన మార్పు నిజమేనా..? నేనింతే అనే వర్మ.. నేను మారతా అంటే నమ్మొచ్చా అనేది ఆడియన్స్‌లో ఉన్న అనుమానం. ఇకపై ఆయన వైఖరి ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..