Dr.Rajasekhar : సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో ‘శేఖర్’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల గరుడవెగ, కల్కి సినిమాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్ తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించారు. ఇటీవలే రాజశేఖర్ కరోనా బారిన పది కోలుకున్నారు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ‘శేఖర్’ మూవీ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఆయన కెరీర్‌లో వస్తున్న 91వ సినిమా. కొత్త దర్శకుడు లలిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా.. తను అనారోగ్యానికి గురైన సమయంలో అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షక దేవుళ్ల మద్దతు వల్లే పుట్టినరోజు నాడు కొత్త సినిమాను ప్రారంభించగలుగుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పోస్టర్ లో వయసు మీద పడిన వ్యక్తిగా కనిపిస్తున్నారు రాజశేఖర్. తెల్లటి జుట్టు, గడ్డంతో ఇంటెన్స్ గా చూస్తున్న రాజశేఖర్ లుక్ ఆకట్టుకుంటుంది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్ మరియు పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :
ప్రేమికుల రోజున ప్రభాస్ సినిమా టీజర్ రాబోతోందా..? ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..