
థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. రకరకాల సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని మాస్ అవతార్ లో అదరగొట్టాడు. అలాగే సూర్య నటించిన రెట్రో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఓటీటీలోనూ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఓటీటీలో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా రొమాంటిక్ సినిమాలు ఇప్పటికే ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్ లు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. రొమాంటిక్ సినిమాల్లో ఈ రేంజ్ ట్విస్ట్ లు మీరు ఎక్కడా చూసుండరు. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఇప్పటికే మలయాళ సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రొమాంటిక్ థ్రిల్లర్ కూడా ఓ మలయాళ సినిమానే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంది ఈ రొమాంటిక్ మూవీ.
ఎలాంటి అంచనాలు లేకుండా.. పెద్ద హడావిడి లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తోపాటు.. రూ. 55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. అంతే కాదు రొమాంటిక్ సీన్స్ లోనూ ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఇంతకూ ఈ సినిమా పేరు ఏంటంటే.. ఈ సినిమా పేరు అంచక్కల్లకోక్కన్. ఇదే సినిమాను తెలుగులో చాప్రా మర్డర్ కేసు టైటిల్ తో డబ్ చేశారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. లుక్మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆర్ ఆచారి, మేఘా థామస్ ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించారు. ఈ సినిమా ఓ మర్డర్ మిస్టరీ థిల్లర్ కథతో తెరకెక్కింది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.