సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారికి పాట క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సూపర్ స్టార్. ఆవెంటనే జక్కన్నతో ఓ సినిమా కమిట్ అయ్యారు. నో బాలీవుడ్, నో హాలీవుడ్… ఐ విల్ బీ విత్ టాలీవుడ్ ఫరెవర్..అని మాటవరసకు అంటే అన్నారు గాని.. ఇప్పుడైతే ఆకాశమే నా హద్దు అని హింట్ ఇస్తున్నారు సూపర్‌స్టార్. జక్కన్నతో చెయ్యబోయే నెక్స్ట్ మూవీతో మహేష్‌బాబు హాలీవుడ్ స్థాయిని టచ్ చేస్తారన్న అంచనా వుంది. రెండేళ్ల కిందటి విషయం.. ఐకాన్ స్టార్ అండ్ గురూజీ కాంబినేషన్‌తో గట్టి పోటీ తగిలినా, దీటుగా నిలబడి బ్లాక్‌బస్టర్ సౌండ్‌తో సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నారు మహేష్ బాబు. కానీ.. రిస్క్ అనేది మళ్లీమళ్లీ చెయ్యకూడదనుకుని.. ఈ ఏడాది సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. సమ్మరే నాకు సేఫ్ హెవెన్ అని సైడిచ్చుకుంది సర్కారువారి పాట. కానీ.. అదే మిడ్ సమ్మర్‌లో ఘట్టమనేని క్యాంప్‌ని హెచ్చరిస్తోంది ఒక హాలీవుడ్ మూవీ.
2018 ఏప్రిల్‌లో రిలీజైన భరత్ అనేనేను.. ఓవర్సీస్‌లో 4 మిలియన్ల మార్క్‌ని కూడా చేరుకోలేదు. కారణమేంటంటే.. అదే టైమ్‌లో వచ్చిన మోస్ట్ ఎవెయిటెడ్ హాలీవుడ్ మూవీ ‘ఎవెంజర్స్-ఇన్‌ఫినిటీ వార్’. తర్వాత 2019 సమ్మర్‌లో రిలీజైన మహర్షి సినిమాక్కూడా సరిగ్గా ఇటువంటిదే మరో ఛాలెంజ్ తగిలింది. ‘ఎవెంజర్స్- ఎండ్‌గేమ్’.. లోకల్‌లోనూ, ఓవర్సీస్‌లోనూ మహర్షి వసూళ్లను గట్టిగానే టార్గెట్ చేసింది ఆ మూవీ. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి.. సర్కారువారి పాట వంతొచ్చింది. ట్రిపులార్‌నీ, ఆచార్యను ఇంటిలిజెంట్‌గా తప్పించుకుని.. మే12వ తారీఖ్‌ని రౌండప్ చేసుకున్నా.. అక్కడా హాలీవుడ్ నుంచి షాక్ ట్రీట్‌మెంట్ తప్పేలా లేదు సూపర్‌స్టార్ మూవీకి. ‘డాక్టర్ స్ట్రేంజ్- మల్టివర్స్ ఆఫ్ మాడ్‌నెస్’ ఇదే సమ్మర్‌లో అదే గ్యాప్‌లో వచ్చేస్తోంది. విచిత్రం ఏంటంటే.. డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో సూపర్‌స్టార్‌ని టార్గెట్ చేస్తున్న ఈ మూడు సినిమాలూ మార్వెల్ మూవీస్ బేనర్‌వే. ఈసారైనా.. హాలీవుడ్ థ్రెట్‌ని తట్టుకుని.. సూపర్‌స్టార్ తన జైత్రయాత్రను కంటిన్యూ చేస్తారేమో చూడాలి మరి. అభిమానులు మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాల రికార్డులను రీచ్ అవుతుంది అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :