AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: లేనిపోని చిక్కుల్లో.. సమంత తీరుపై తీవ్ర విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన నటి..

సమంత మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్‌మీడియాలో ఆమె పెట్టిన ఓ పోస్టు కాక రేపింది. దాంతో.. సమంత తీరుపై కొందరు డాక్టర్లు, నెటిజన్లు విరుచుకుపడడం, ఆపై.. ఆమె కౌంటర్‌ ఇవ్వడం మరింత హీట్‌ పెంచింది. ఇంతకీ.. సమంత పెట్టిన పోస్టు ఏంటి?.. ఆమెపై కొందరు డాక్టర్లు ఎందుకు సీరియస్ అయ్యారు?.. అసలు.. ఆ డాక్టర్లకు సమంత ఏమని కౌంటర్‌ ఇచ్చింది?..

Samantha: లేనిపోని చిక్కుల్లో.. సమంత తీరుపై తీవ్ర విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన నటి..
Samantha Ruth Prabhu
Ram Naramaneni
|

Updated on: Jul 06, 2024 | 9:21 AM

Share

సమంత.. స్టార్‌ హీరోయిన్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌తోపాటు.. బాలీవుడ్‌నూ ఏలేస్తోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియా.. అందులోనూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే.. కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత.. అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్స్‌, కొటేషన్స్‌ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సమంత ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టు ఆమెను వివాదంలోకి లాగింది. మయొసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత.. కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తోంది. వాటికి సంబంధించిన వివరాల్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. దానిలో భాగంగానే.. సమంత నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్ చేసింది. సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు డిస్టిల్డ్‌ వాటర్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్‌ చెయ్యండని చెప్తూ లివర్ డాక్టర్‌ తన ఇన్‌స్టాలో పెట్టినట్లు సమంత చెప్పుకొచ్చింది. అంతే.. సమంత చెప్పిన ఆ మ్యాజిక్‌ ఫార్ములాపై కొందరు డాక్టర్లు మండిపడ్డారు. ఆమెపై ఒక్కసారిగా విమర్శలతో విరుకుపడ్డారు.

ప్రధానంగా.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ గురించి సమంత ప్రస్తావించడంపై అభయ్‌ ఫిలిప్‌ అనే లివర్‌ డాక్టర్‌ భగ్గుమన్నారు. తనకుతాను డాక్టర్ లా ఫీల్ అయి ఉచిత సలహాలు ఇవ్వొద్దని సూచించారు. సమంత చెప్పిందని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేస్తూ.. అమెరికాకు చెందిన ఆస్తమా, అలెర్జీ ఫౌండేషన్ హెచ్చరికలను ప్రస్తావించారు. సెలబ్రిటీ ముసుగులో తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు డాక్టర్‌ అభయ్‌ ఫిలిప్‌.

ఇక.. డాక్టర్‌ విమర్శలపై స్పందించిన సమంత.. ఆయన పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక పెద్దమనిషి తన పోస్ట్‌ను, సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారని ఆ డాక్టర్‌ను ఉద్దేశించి రాసుకొచ్చింది. ఆయన కూడా డాక్టరే.. తన కంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు.. కానీ.. తనను నిందించడం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేదని హితవు పలికింది. అంతేకాదు.. జైల్లో పెట్టాలని విమర్శించినందుకు బాధలేదని.. పదజాలం కరెక్ట్‌గా ఉంటే గౌరవించేదానిని అన్నది. అయితే.. ఒక సెలబ్రిటీని కాబట్టి అంత సులువుగా నిందించారని భావిస్తున్నానని.. కానీ.. సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ చెప్పలేదు.. ఒక సామాన్య వ్యక్తిగానే పోస్ట్‌ చేశాను.. అంటోంది సమంత. మొత్తంగా.. ఇన్‌స్టాలో ఒక పోస్టు.. డాక్టర్‌ రిప్లై.. సమంత కౌంటర్‌తో.. సోషల్‌ మీడియాలో ఆమె మరోసారి హాట్‌టాపిక్‌ అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us