Tollywood: అమ్మబాబోయ్.! ఏం అందం.. సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను మీరు చూశారా.?

|

Aug 03, 2024 | 12:27 AM

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన 'సుస్వాగతం' మూవీ గుర్తుందా.? అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అని చెప్పొచ్చు. ఇక ఇందులో దేవయాని హీరోయిన్‌గా నటించింది.

Tollywood: అమ్మబాబోయ్.! ఏం అందం.. సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను మీరు చూశారా.?
Tollywood
Follow us on

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ మూవీ గుర్తుందా.? అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అని చెప్పొచ్చు. ఇక ఇందులో దేవయాని హీరోయిన్‌గా నటించింది. ఆమెకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ.. తన నటనకు ఫ్యాన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత హీరోయిన్‌గా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. పలు చిత్రాల్లో సహాయ నటిగా నటించి మెప్పించింది. అనంతరం మహేష్ బాబు నటించిన ‘నాని’ సినిమాలో తల్లి పాత్రలో మెరిసింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించిన దేవయాని.. కోలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్‌తో ప్రేమలో పడి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది.

వీరికి ఇనియా, ప్రియాంక అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో దేవయాని కూతుళ్లను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎంతో క్యూట్‏గా సంప్రదాయంగా కనిపిస్తున్నారని.. అమ్మ అందం పుణికిపుచ్చుకున్నారని.. అందంలో స్టార్ హీరోయిన్స్‌కు కూడా ఏమాత్రం తీసిపోరని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాల్లో కనిపించిన దేవయాని.. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసి టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. తమిళనాడులోని స్థానిక అన్నాసాలైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది దేవయాని.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి