కేజీఎఫ్ 2 నటి రవీనా టాండన్ కూతుర్ని మీరెప్పుడైనా చూశారా.? అందంలో అమ్మను మించి..

కేజీఎఫ్-2లో రమికా సేన్ పాత్రకు ప్రాణం పోసింది బాలీవుడ్ నటి రవీనా టాండన్. హీరో యశ్‌కు పోటీగా ఆమె తన నటనతో అదరగొట్టి.. ఏకంగా ఇండియా వైడ్‌గా..

కేజీఎఫ్ 2 నటి రవీనా టాండన్ కూతుర్ని మీరెప్పుడైనా చూశారా.? అందంలో అమ్మను మించి..
Raveena Tandon

Updated on: Jun 13, 2023 | 2:00 PM

కేజీఎఫ్-2లో రమికా సేన్ పాత్రకు ప్రాణం పోసింది బాలీవుడ్ నటి రవీనా టాండన్. హీరో యశ్‌కు పోటీగా ఆమె తన నటనతో అదరగొట్టి.. ఏకంగా ఇండియా వైడ్‌గా అద్భుతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా.. 90sలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. 1991లో ‘పత్తర్ కే ఫూల్’ సినిమాతో బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది రవీనా టాండన్. 2004లో ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని వివాహమాడింది రవీనా టాండన్. వివాహం అనంతరం అడపాదడపా సినిమాలు చేసిన రవీనా టాండన్.. 2022లో హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించింది.

రవీనా టాండన్ వ్యక్తిగత విషయానికొస్తే.. ఈమె 2004, ఫిబ్రవరి 22న అనిల్ తడానీతో వివాహం అయింది. వీరికి రాషా అనే కూతురు, రణబీర్వర్దన్ అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం రవీనా టాండన్ కుమార్తె రాషా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆమె అంబానీ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. తన కూతురు రాషా గ్రాడ్యుయేషన్ డే ఫోటోలను ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకుని.. పుత్రికోత్సవంలో మునిగి తేలుతుంది. ఇక నెటిజన్లు రాషా ఫోటోలను చూసి.. అందం, అణుకువలో అమ్మను మించిపోయిందని.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.