
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటారు విజయశాంతి. లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును అప్పట్లోనే సొంతం చేసుకున్నారు విజయశాంతి. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు విజయశాంతి. హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు విజయశాంతి. విజయ శాంతి చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇదిలా ఉంటే పై ఫొటోలో విజయశాంతి చేతిలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఆ చిన్నోడు స్టార్ హీరో.. అంతే కాదు టాలీవుడ్ ను షేక్ చేశాడు ఆ బుడతడు. ఇంతకు ఆ చిన్నోడో ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫొటోలో విజయశాంతి చేతిలో ఉన్న చిన్నోడు ఎవరో కాదు .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చరణ్. ఆతర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరుత సినిమాతో పరిచయమైన చరణ్ ఆతర్వాత మగధీర సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత మెగా పవర్ స్టార్ గా ఎదిగి సినిమాలు చేస్తున్నాడు.
ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు చరణ్. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం చరణ్ బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే బుచ్చి బాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి