
ఒక్క సాలిడ్ హిట్ పడితే చాలు కేరీర్ టర్న్ అవుతుందని చాలా మంది యంగ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఏడాది రెండు నుంచి మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు కుర్ర హీరోలు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఎప్పుడూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరో ఒకరు. హీరో అనేదానికి పర్ఫెక్ట్ కటౌట్ ఆయన. తన నటనతో డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతే కాదు ఓ స్టార్ హీరో ఫ్యామిలీకి సంబందించిన హీరో కూడా.. ఇంతకూ ఎవరో గుర్తుపట్టారా.? మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఆయనకు పేరుంది.
కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. పై ఫొటోలో ఉన్న హీరో ఆయనే.. శివ మనసులో శృతి అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత ప్రేమ కథ చిత్రం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు కు మంచి ఆఫర్స్ వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయాడు. సుధీర్ బాబు హీరోగా నటించే సినిమాలు డిఫరెంట్ స్టోరీస్ తో ఉంటాయి. కేవలం హీరోగానే కాదు విలన్ గాను నటించాడు సుధీర్. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ కలిసి నటించిన బాగి మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా వర్షం సినిమాకు రీమేక్.
కొత్త దర్శకులతో, కొత్త కథలతో ఎప్పుడూ సినిమాలు చేస్తుంటాడు సుధీర్ బాబు. తాజాగా హరోం హర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది, సుధీర్ బాబు సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు, మహేష్ బాబు బావ అన్న విషయం తెలిసిందే. మహేష్ చెల్లెలు ప్రియదర్శినిని సుధీర్ బాబు వివాహం చేసుకున్నాడు. సుధీర్ బాబు సినిమాలకు మహేష్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు.ఇక సినిమాల్లోకి రాకముందు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బ్యాడ్మింటన్ ప్లేయర్స్ లో నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు సుధీర్ బాబు.