
సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు అన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక సెలబ్రెటీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇక ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..
పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు. ఒకప్పుడు తన నటనతో అందంతో కుర్రాళ్లను కట్టిపడేసిన ముద్దుగుమ్మ రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. హీరోలకు అమ్మ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు.
బాహుబలి సినిమాతో రమ్యకృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించారు రమ్యకృష్ణ. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తల్లిగా కనిపించారు రమ్యకృష్ణ. ఇక పై ఫొటోలో రమ్యకృష్ణతో పాటు ఉంది ఎవరో కాదు. రమ్యకృష్ణ కొడుకు. రిత్విక్ వంశీ. రమ్యకృష్ణ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక కుమారుడు. ఇక సోషల్ మీడియాలో రమ్యకృష్ణ చాలా యాక్టీవ్ గా ఉంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.