
చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ కు క్యూ కట్టారు. అలాగే టాలీవుడ్ లో రాణించిన బ్యూటీస్ చాలా మంది బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ కూడా తమ సత్తా చాటుతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేక బాలీవుడ్ కు వెళ్లి అక్కడ బిజీగా మారిపోయారు. పైన కనిపిస్తున్న చిన్నది కూడా ఆ లిస్ట్ లో ఉంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమెను ఇప్పుక్ చూస్తే షాక్ అవుతారు. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఆ చిన్నది. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.?
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు. చేసింది తక్కువ సినిమాలే అయినా .. హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఆ చిన్నది.. ఆమె అదా శర్మ. టాలీవుడ్ లో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. హార్ట్ ఎటాక్ సినిమాలో క్యూట్ గా నటించిన అదా శర్మ. ఆతర్వాత తెలుగులో అవకాశాలు అందుకోలేక పోయింది.
సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో కనిపించి ఆకట్టుకుంది ఈ అమ్మడు. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ క్రేజీ ఆఫర్స్ అందుకుంది అదా శర్మ. కేరళ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అలాగే పలు ప్రాజెక్ట్స్ లోనూ నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు అందాలతోనూ అదరగొడుతోంది. సోషల్ మీడియాలో అదా శర్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అదా తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..