Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

చైల్డ్ ఆర్టిస్టులకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో బాలనటీనటులుగా కనిపించిన తారలు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. మీకు వెంకటేశ్ నటించిన సూర్యవంశం సినిమా గుర్తుందా.. ? అందులో వెంకీ తనయుడిగా కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇంతకీ అతడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ?

Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
Suryavamsham

Updated on: Nov 22, 2025 | 11:35 AM

విక్టరీ వెంకటేశ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్నో హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. కామెడీ టైమింగ్, ఎమోషనల్, మాస్ యాక్షన్ సినిమాలతో మెప్పించాడు. వెంకీ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో సూర్యవంశం ఒకటి. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇందులో వెంకీ కొడుకుగా అమాయకమైన నటనతో కట్టిపడేశాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ఆనంద్ హర్షవర్ధన్. ఒకప్పుడు తెలుగులో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు.

ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..

ఆనంద్ హార్షవర్దన్.. విలక్షణ నటుడు జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి ప్రధాన పాత్రలలో నటించిన ప్రియరాగాలు సినిమాలో కనిపించాడు.ఆ తర్వాత తెలుగులో బాలరామాయణం సినిమాలో వాల్మీకి పాత్రలో కనిపించాడు. అలాగే ప్రేమించుకుందాం రా సినిమాలోనూ కనిపించాడు. తెలుగుతోపాటు హిందీ భాషలలోనూ నటించారు. ఒకప్పుడు తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

తెలుగులో దాదాపు 25 సినిమాల్లో నటించిన ఆనంద్ హర్షవర్ధన్.. ఆ తర్వాత చదువుల దృష్ట్యా సినిమాలకు దూరమయ్యాడు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన ఆనంద్.. తర్వాత నిదురించు జహాపన అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు ఆనంద్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు అడియన్స్.

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..