Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఇప్పుడు ఇలా..

తెలుగులో కేవలం ఒక్క సినిమాలో కనిపించింది. కానీ ఆ మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో దెబ్బకు ఇండస్ట్రీకి దూరమయ్యింది. బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ అక్కడే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండిపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇన్ స్టా పోస్టుతో మరోసారి నెటిజన్స్ ముందుకు వచ్చింది.

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్.. ఇప్పుడు ఇలా..
Riya Sen

Updated on: Jan 25, 2026 | 8:01 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె బిజీ బ్యూటీ. కానీ మీకు తెలుసా.. ? తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తన పేరు రియా సేన్. బెంగాలీ కుటుంబంకు చెందిన అమ్మాయి. ఆమె తల్లి మూన్ మూన్ సేన్, అమ్మమ్మ సుచిత్రా సేన్. వీరిద్దరు నటీమణులు కావడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..

రియా సేన్ సోదరి సైతం పాపులర్ హీరోయిన్. ఆమె రైమా సేన్. ఇద్దరు అక్కాచెలెళ్లు. అక్కా రైమా సేన్.. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ధైర్యం సినిమాలో నటించింది రైమా సేన్. ఇక రియా సేన్ ఐదేళ్ల వయసులోనే తన తల్లి సినిమాలో కూతురిగా నటించింది. ఆ తర్వాత తాజ్ మహల్ అనే సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అలాగే హిందీ, బెంగాలీ, మలయాళీ, ఇంగ్లీష్, ఒడియా చిత్రాల్లో నటించింది. తెలుగులో కేవలం ఒక్క సినిమా చేసింది. అదే నేను మీకు తెలుసా..? కానీ ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో టాలీవుడ్ కు దూరమయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. కథానాయికగా, ఇటు స్పెషల్ సాంగ్స్ చేస్తూ పాపులర్ అయ్యింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2017లో వ్యాపారవేత్త శివం తివారిని పెళ్లి చేసుకుందంటూ ప్రచారం జరిగింది. అలాగే కొన్ని ఫోటోస్ సైతం వైరల్ కాగా.. వాటి పై ఇప్పటికీ రియాక్ట్ కాలేదు రియా. ప్రస్తుతం తన అక్కతో కలిసి ఆమె షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..