Gunde Jhallumandi : ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..

టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. ఇప్పటికీ ప్రేక్షకుల మనసులలో చెరగని రూపం. ఎలాంటి బ్యాక్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరో. కానీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్న సమయంలోనే మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్ సరసన ఎంతో మంది హీరోయిన్స్ నటించారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

Gunde Jhallumandi : ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..
Aditi Sharma

Updated on: Jan 19, 2026 | 7:40 AM

టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన సినిమాల హవా ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. ప్రేమకథ చిత్రాలతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్న హీరో సైతం ఉదయ్ కావడం విశేషం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన ఉదయ్.. మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకున్నారు. ఉదయ్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ గురించి ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది. ఇదిలా ఉంటే.. ఉదయ్ కిరణ్ సినీప్రయాణంలో ఎంతో మంది హీరోయిన్స్ కలిసి నటించారు. అందులో ఈ అమ్మడు ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె పేరు అదితి శర్మ.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

ఉదయ్ కిరణ్ నటించిన సినిమాల్లో గుండె ఝల్లుమంది ఒకటి. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అదితి శర్మ కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందం, నటనతో ఆకట్టుకుంది. చూడచక్కని రూపం, అందమైన చిరునవ్వుతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఓం శాంతి సినిమాలో కనిపించింది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగులో వరుస ప్లాపులు రావడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. కానీ హిందీ, పంజాబీ భాషలలో అవకాశాలు వచ్చాయి. మొత్తం 12కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

2014లో బాలీవుడ్ నటుడు సర్వర్ అహుజాను పెళ్లి చేసుకుంది అదితి శర్మ. వీరికి 2019లో కుమారుడు జన్మించింది. పెళ్లి తర్వాత సినీరంగంలో యాక్టివ్ గా ఉంది. పంజాబీలో టీవీ షోలు, యాడ్స్ చేస్తూ బిజీగా ఉండిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో ఆశ్చర్యపరుస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..